IPL: క్రికెటర్లను తాకిన ‘అరబిక్ కుత్తు’ ట్రెండ్.. ‘హలమిత్తి హబీబో’ అంటూ డాన్స్ ఇరగదీసిన టీమిండియా కుర్రాళ్లు

Published : Mar 18, 2022, 09:42 AM IST
IPL: క్రికెటర్లను తాకిన ‘అరబిక్ కుత్తు’ ట్రెండ్.. ‘హలమిత్తి హబీబో’ అంటూ డాన్స్ ఇరగదీసిన టీమిండియా కుర్రాళ్లు

సారాంశం

IPL 2022: నిన్నా మొన్నటి దాకా క్రికెటర్లను ఉర్రూతలూగించిన పుష్ప ట్రెండ్ ముగిసింది. ఇప్పుడు ఆ స్థానాన్ని మరో దక్షిణాది సినిమా భర్తీ చేసింది.  ఇప్పుడు ‘అరబిక్ కుత్తు’ తో క్రికెటర్లంతా ‘హలమిత్తి హబీబో..’ అంటున్నారు. 

మీరు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రీల్స్ లో ఓ పాట  తెగ ట్రెండ్ అవుతుంది కదా..  అదేనండి ‘అరబిక్ కుత్తు..’. తమిళ హీరో విజయ్ నటించిన బీట్స్ సినిమాలోని  ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతున్నది. ‘హలమిత్తి హబీబో..’ అంటూ  అరబిక్, తమిళ్ లో సాగే ఈ పాట ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది. చిత్ర సీమకు సంబంధించిన బిగ్ స్టార్స్ అంతా ఇప్పటికే ఈ పాటకు  తమ కాలు కదిపారు. ఇప్పుడిక క్రికెటర్ల వంతు..  ట్రెండింగ్ లో ఉన్న ఈ పాటకు  ప్రముఖ క్రికెటర్లు.. బెస్ట్ ఫ్రెండ్స్ గా పేర్కొనే అవేశ్ ఖాన్, వెంకటేశ్ అయ్యర్ లు  కూడా తమ డాన్స్ స్కిల్స్ చూపించారు. 

అవేశ్ ఖాన్-వెంకటేశ్ అయ్యర్ లు కలిసి  అరబిక్ కుత్తు పాటకు డాన్స్ చేశారు. ప్రస్తుతం  ఐపీఎల్ సన్నాహకాల్లో ఉన్న ఈ ఆటగాళ్లిద్దరూ కలిసి ఈ పాటకు తమదైన స్టెప్స్ తో డాన్స్ ఇరగదీశారు.  గురువారం సాయంత్రం అవేశ్ ఖాన్ తన ఇన్స్టా ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేశాడు.  పోస్టు చేసిన కొద్దిసేపటికే  ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

 

తమిళ్ లో యువ దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బీట్స్ సినిమాలో దళపతి విజయ్ హీరోగా నటిస్తుండగా బుట్ట బొమ్మ  పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్నది. యువ సంగీత సంచలనం అనిరుద్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ  కథానాయకుడు శివ కార్తీకేయన్ ‘అరబిక్ కుత్తు’ పాటను రాయడం విశేషం. జొనాథన్ గాంధీ, అనిరుద్ కలిసి పాడిన ఈ పాట  ఇప్పుడు యూట్యూబ్ లో ఒక సంచలనం. ఇక సోషల్ మీడియాలో అయితే ఎక్కడ చూసినా ‘హలమిత్తి హబీబో..’నే.. 

ఇదిలాఉండగా.. ఈ వీడియోను ఇన్స్టాలో షేర్ చేస్తూ అవేశ్ ఖాన్.. ‘ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న అరబిక్ కుత్తు ను ట్రై చేస్తున్నాను..’ అని రాసుకొచ్చాడు. ఈ వీడియోను తీసింది ఇషాన్ కిషాన్ కావడం విశేషం. 

ఇక ఈ మధ్యప్రదేశ్ కుర్రాళ్ల  విషయానికొస్తే అవేశ్ ఖాన్-వెంకటేశ్ అయ్యర్ లు చిన్నప్పట్నుంచే ఫ్రెండ్స్. ఈ ఇద్దరూ కలిసి మధ్యప్రదేశ్  రంజీ టీమ్ లో సభ్యులు.  ఇద్దరూ ఒకేసారి కెరీర్ మొదలుపెట్టారు. ఐపీఎల్ లో గతేడాది అయ్యర్ కోల్కతా తరఫున ఆడి మెరవగా అవేశ్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడి  అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ఇద్దరూ ఇటీవలే భారత జట్టులోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. 

ఇక  గతేడాది ఐపీఎల్ లో అదరగొట్టడంతో కేకేఆర్  అయ్యర్ ను రిటెన్షన్ ప్రక్రియలో అట్టిపెట్టుకుంది. రిటెన్షన్ ప్రక్రియలో అయ్యర్ ను రూ. 8 కోట్లతో దక్కించుకుంది.  ఇక రూ. 20 లక్షల బేస్ ప్రైజ్ తో  ఐపీఎల్ వేలంలోకి వచ్చిన  అవేశ్ ఖాన్ ను లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ. 10 కోట్లతో దక్కించుకుంది. అన్ క్యాప్డ్ ప్లేయర్ కు ఇంత ధర దక్కడం ఇదే ప్రథమం. ఇంతకుముందు సీఎస్కేతరఫున ఆడిన  కృష్ణప్ప గౌతమ్ కు ఆ జట్టు రూ. 9.25 కోట్లతో దక్కించుకుంది. 

PREV
click me!

Recommended Stories

సింహం ఒక్క అడుగు వెనక్కి.. కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడతానన్నది ఇందుకేనా.?
గుర్తుపెట్టుకో.! 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆ ఇద్దరినీ ఎవరూ ఆపలేరు.!