రెండేండ్లుగా మొత్తుకుంటున్నా నమ్మరేంట్రా బాబు? హిట్ మ్యాన్ తో విభేదాలపై కోహ్లీ క్రిస్టల్ క్లీయర్ రిప్లై

Published : Dec 15, 2021, 06:08 PM ISTUpdated : Dec 15, 2021, 06:12 PM IST
రెండేండ్లుగా మొత్తుకుంటున్నా నమ్మరేంట్రా బాబు? హిట్ మ్యాన్ తో విభేదాలపై కోహ్లీ క్రిస్టల్ క్లీయర్ రిప్లై

సారాంశం

Virat Kohli On Rohit Sharma: వాళ్లిద్దరూ దాదాపు ఒకే సమయంలో భారత క్రికెట్ లోకి వచ్చారు. ఇద్దరూ ఒకే చెట్టు నీడ కింద ఎదిగారు. కానీ కొద్దికాలంగా ఆ ఇద్దరు ఆటగాళ్ల మధ్య అభిప్రాయభేదాలు తారాస్థాయికి చేరాయనేది విమర్శకుల వాదన. కానీ...!

టీమిండియాకు మూడు ఫార్మాట్లలో సారథ్యం వహిస్తున్న ఇద్దరు  సారథుల మధ్య వైరం గురించి గత కొంతకాలంగా మీడియాలో జోరుగా చర్చ నడుస్తున్నది.  టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి, పరిమిత ఓవర్ల  క్రికెట్ టీమ్ లకు నాయకుడిగా ఉన్న రోహిత్ శర్మ మధ్య విభేదాలున్నాయని, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తాజాగా తీసుకున్న (వన్డే కెప్టెన్సీ) నిర్ణయంతో  అవి ఇంకా ఎక్కువయ్యాయని  పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై ఇప్పటికే రోహిత్ తో పాటు విరాట్ కూడా పలుమార్లు స్పందించారు. అయినా కూడా అవి ఆగడం లేదు. తాజాగా బుధవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో విరాట్ కోహ్లీ వీటికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. తమ మధ్య విభేదాలేమీ లేవని రెండున్నరేండ్లుగా చెబుతూనే ఉన్నానని, ఇంకా కూడా  అటువంటి వార్తలే రాస్తే ఇక తాను ఏం చేయలేనని చెప్పుకొచ్చాడు.

విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... ‘నాకు  రోహిత్ శర్మతో ఎలాంటి ఇబ్బంది లేదు. మా మధ్య గొడవలేమీ లేవు. ఈ విషయాన్ని నేను దాదాపు రెండున్నర ఏండ్లుగా చెబుతూనే ఉన్నా.  మీరు అడిగిన ప్రతిసారి చెప్పి చెప్పి నేను విసిగిపోయాను..’అని స్పష్టతనిచ్చాడు. 

 

భారత జట్టులోకి ఈ ఇద్దరు  ఆటగాళ్లు దాదాపు ఒకే సమయంలో వచ్చారు. ఇద్దరిదీ సుమారు ఒకే వయసు.  భారత జట్టు తరఫున ఈ ఇద్దరూ చేసిన పరుగులు, సాధించిన రికార్డులు ఇప్పట్లో బద్దలు కొట్టేవి కావు. మాజీ సారథి ఎంఎస్ ధోని నీడన ఎదిగిన ఈ ఇద్దరూ.. గత కొద్దికాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని, టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో ముంబై వర్సెస్ ఢిల్లీ గా ఉందని పుంఖానుపుంఖాలుగా వార్తలు వచ్చాయి. 

ఇక తాజాగా.. విరాట్ ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి దానిని రోహిత్ శర్మకు అప్పగించడంతో ఇవన్నీ నిజమేనని  విరాట్, రోహిత్ శర్మ ఫ్యాన్స్ భావించారు. సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా ఈ ఇద్దరు ఆటగాళ్ల అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తున్నది.

 

ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘తాను విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడటాన్ని ఎంతగానో ఎంజాయ్ చేశాన’ని చెప్పుకొచ్చాడు. తమ మధ్య అభిప్రాయభేదాలు మీడియా  సృష్టేనని కొట్టిపారేశాడు. ఇక తాజాగా కోహ్లీ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఇరు ఆటగాళ్ల అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అంతేగాక తాను రోహిత్ శర్మ సారథ్యంలో ఆడతానని క్లారిటీ ఇచ్చాడు. 

‘రోహిత్ శర్మ గొప్ప సామర్థ్యమున్న నాయకుడు. అతడి వ్యూహాలు అద్భుతంగా ఉంటాయి. రోహిత్ నేతృత్వంలో భారత జట్టు సాధించిన విజయాలు, ఐపీఎల్ లో అతడు సాధించిన ట్రోఫీలుగానీ హిట్ మ్యాన్ సామర్థ్యమేంటో చెబుతున్నాయి.. రోహిత్ శర్మకు, కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ కు నేను వంద శాతం సహకరిస్తా..’అని విమర్శకుల నోళ్లు మూయించాడు విరాట్. 

ఇదీ చదవండి : Virat Kohli: నన్ను తొలగిస్తున్నానని గంటనర ముందు చెప్పారు.. అతడి సారథ్యంలో ఆడతా.. క్లారిటీ ఇచ్చిన కోహ్లీ

ఇక తాజా పరిణామాలతో నిన్నటి దాకా ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్న  హిట్ మ్యాన్, కింగ్ కోహ్లీ అభిమానులు.. ఇప్పుడు అదే దుమ్మును బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీతో పాటు బోర్డు పెద్దల మీద పారబోస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మంచోళ్లేనని, బీసీసీఐ పెద్దలే వారి మధ్య విభేదాలు సృష్టిస్తూ దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !