IND vs SL : ఉత్కంఠ మ్యాచ్.. సూపర్ ఓవర్‌లో శ్రీలంక చిత్తు.. సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసిన భారత్

By Mahesh Rajamoni  |  First Published Jul 31, 2024, 12:58 AM IST

India vs Sri Lanka : భారత్ vs శ్రీలంక మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ పల్లెకెలెలో జరిగింది. సూపర్ ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి 3-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది.
 


India vs Sri Lanka :  శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో మ‌రో భార‌త్ మ‌రో థ్రిల్లింగ్ మ్యాచ్ లో సూప‌ర్ విక్ట‌రీ అందుకుంది. టీమిండియా-శ్రీలంక మధ్య జ‌రిగిన‌ మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ పల్లెకెలెలో జరిగింది. సూపర్ ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత‌ విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో సూర్య‌కుమార్ యాద‌వ్ కెప్టెన్సీలోని భార‌త జ‌ట్టు 3-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. ఇదే గ్రౌండ్లో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో వర్షం కార‌ణంగా ఓవ‌ర్లు త‌గ్గించారు. డక్‌వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో మ్యాచ్ సూపర్ ఓవ‌ర్ వ‌ర‌కు వెళ్లిన చివ‌ర‌కు భార‌త్ విజ‌యం సాధించింది.

ఈ మ్యాచ్ లో చరిత్ అసలంక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. శ్రీలంక బౌలర్ల ధాటికి భారత జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగుల స్కోరుకే పరిమితమైంది. అనంతరం 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు చేసింది. మ్యాచ్ టై కావ‌డంతో సూప‌ర్ ఓవ‌ర్ కు వెళ్లింది. ఇక సూపర్ ఓవర్  లో భార‌త్ విజయం సాధించింది. సూప‌ర్ ఓవ‌ర్ లో భార‌త్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.  శ్రీలంక సూపర్ ఓవర్‌లో 2 పరుగులకే ఆలౌట్ అయింది.

Latest Videos

undefined

థ్రిల్లింగ్ గేమ్.. సూర్య కుమార్ బౌలింగ్.. ! 

ఈ మ్యాచ్ లో శ్రీలంక విజయానికి చివరి ఓవర్‌లో 6 పరుగులు చేయాల్సి ఉంది. సూర్యకుమార్ యాదవ్ ఆశ్చర్యకరంగా బౌలింగ్ చేయడానికి వచ్చాడు. త‌న ఓవ‌ర్ లో వరుసగా రెండు బంతుల్లో కమిందు మెండిస్‌, మహిష్‌ తిక్షిణలను అవుట్ చేసి మ్యాచ్ ను మ‌లుపు తిప్పాడు. చివరి బంతికి శ్రీలంక 3 పరుగులు చేయాల్సి వచ్చింది. విక్రమసింఘే 2 పరుగులు చేసి స్కోరును సమం చేశాడు. దీంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు చేరుకుంది. అంతకుముందు ఓవర్ లో రింకూ సింగ్ కూడా బౌలింగ్ వేసి రెండు వికెట్లు తీసుకోవడం గమనార్హం. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా  బౌలింగ్, బ్యాటింగ్ లో రాణించిన వాషింగ్టన్ సుందర్ నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. 

 

Captain led from the front throughout the series and he becomes the Player of the Series 👏👏

Scorecard ▶️ https://t.co/UYBWDRh1op pic.twitter.com/MoReOCXtDH

— BCCI (@BCCI)

 

పారిస్ ఒలింపిక్స్ 2024 లో మ‌ను భాక‌ర్ హ్యాట్రిక్ కొడుతుందా?

click me!