సప్త సముద్రాలు ఈదాలి.. రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలి : గోలి శ్యామలకు శ్రీనివాస్ గౌడ్ ప్రశంసలు

By Srinivas MFirst Published Jan 20, 2022, 4:02 PM IST
Highlights

Telangana Sports Minister Praises Goli Shyamala: పసిఫిక్ మహాసముద్రంలోని ఓ ఐలాండ్ ను ఈదిన హైదరాబాద్ స్విమ్మర్ ను తెలంగాణ అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఆమె సాహసాల గురించి తెలుసుకుని హర్షం వ్యక్తం చేశారు. 

హైదరాబాద్ కు చెందిన అంతర్జాతీయ స్విమ్మింగ్ క్రీడాకారిణి గోలి శ్యామల ను మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఎంతో ప్రమాదకరమైన, అత్యంత చల్లగా ఉండే లోతైన ప్రాంతమైన అమెరికా లోని పసిఫిక్ మహాసముద్రం లోని కేటాలిన ఐలాండ్ నుండి లాస్ ఏంజెల్స్ వరకు (సుమారు 36 కిలోమీటర్లు) ఆమె స్విమ్మింగ్  అడ్వెంచర్స్ లో సర్టిఫికేట్  సాధించింది. ఈ  సందర్భంగా శ్యామల ను శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు. 

త్వరలో అమెరికా లోని పసిఫిక్ మహా సముద్రంలో అతి ప్రమాదకర రెండవ పొడవైన ఛానల్ మోలోకై కైవి ( Molokai Kaiwi - 46 కిలోమీటర్లు) ను అధిరోహించాలానే లక్ష్యాన్ని చేపట్టనున్నట్టు ఈ సందర్భంగా ఆమె మంత్రికి వివరించారు. దీనిపై శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ.. శ్యామల యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ యాత్ర ను ఆమె త్వరలోనే చేపట్టనున్నారు. 

ఈ సందర్భంగా  శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఇండియా- శ్రీలంక దేశాల మధ్య ఉన్న హిందు మహాసముద్రం లో ఉన్న పాక్ జల సంధి (30 కిలోమీటర్లు) ను ఈదిన రెండో మహిళ స్విమ్మింగ్ క్రీడాకారిణి గా శ్యామల  చరిత్ర సృష్టించారన్నారు. ప్రపంచంలోని సప్త సముద్రాలను ఈది తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశానికీ పేరు ప్రతిష్టలు తీసుకరావాలని ఆయన ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయిలో  స్విమ్మింగ్ విభాగంలో రాణిస్తూ  రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకరావడం సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో జోఇన్ స్పోర్ట్జ్ స్విమ్మింగ్ అకాడమీ వ్యవస్థాపకులు సిద్దిక్వి, క్రీడా శాఖ అధికారులు సుజాత, స్పోర్ట్స్ స్కూల్ స్పెషల్ ఆఫీసర్ డా. హరికృష్ణ లు  పాల్గొన్నారు. 

కాగా ఇప్పుడంటే సముద్రాలను అలవోగకా ఈదేస్తున్న శ్యామలకు  గతంలో నీళ్లంటేనే భయమట.. ఏదో హాబీగా నేర్చుకున్న ఆమెకు ఈ క్రీడ ప్రవృత్తిగా మారిపోయింది.  గతంలో పాక్ జలసంధిని ఈదిన శ్యామలకు బీటెక్ చదివే బాబు  కూడా ఉన్నాడు. ఈ వయసులో కూడా ఆమె సాహసాలపై మక్కువ పెంచుకుని  స్విమ్మింగ్ లో రాణిస్తుండటం స్పూర్తిదాయకం.

click me!