పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఘన విజయం... రెండు రోజుల్లోనే ముగిసిన టెస్టు...

By team teluguFirst Published Feb 25, 2021, 7:54 PM IST
Highlights

7.4 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించిన టీమిండియా...

రెండు రోజుల్లోనే ముగిసిన పింక్ బాల్ టెస్టు...

ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ నుంచి ఇంగ్లాండ్ అవుట్...

పింక్ బాల్ టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టును రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకి ఆలౌట్ చేసిన టీమిండియా, 49 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది.

ఐదు రోజుల టెస్టు మ్యాచ్, రెండు రోజుల్లోనే ముగిసింది.. మొదటి రోజు టెస్టులో ఇంగ్లాండ్‌ 112 పరుగులకి ఆలౌట్ కాగా, భారత జట్టు 145 పరుగులకి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.శుబ్‌మన్ గిల్ 15 పరుగులు చేయగా రోహిత్ శర్మ 25 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించాడు. 

తొలి రోజు ఆటలో 13 వికెట్లు పడగా, రెండో రోజు 17 వికెట్లు పడడం విశేషం. పింక్ బాల్ టెస్టులో ఓడిన ఇంగ్లాండ్ జట్టు, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ పోటీ నుంచి తప్పుకుంది.

ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగే నాలుగో టెస్టు ఫలితం మీద ఆధారపడి భారత్, ఆస్ట్రేలియా జట్లు, న్యూజిలాండ్‌తో ఫైనల్‌లో తలబడతాయి. ఆఖరి టెస్టులో టీమిండియా గెలిస్తే, నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడితే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో ఢీకొడుతుంది. 

click me!