5 పరుగుల ఆధిక్యం... మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా... రోహిత్, రిషబ్ పంత్ అవుట్..

By team teluguFirst Published Feb 25, 2021, 3:14 PM IST
Highlights

7 పరుగులు చేసి అవుట్ అయిన అజింకా రహానే...

66 పరుగులు చేసి అవుటైన రోహిత్ శర్మ... ఒక్క పరుగుకే అవుటైన రిషబ్ పంత్...

117 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా...

99/3 స్కోరు వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా, వెంటవెంటనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. 25 బంతుల్లో ఒక ఫోర్‌తో 7 పరుగులు చేసిన అజింకా రహానేను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన జాక్ లీచ్, తర్వాతి ఓవర్‌లో రోహిత్ శర్మను కూడా పెవిలియన్ చేర్చాడు...

96 బంతుల్లో 11 ఫోర్లతో 66 పరుగులు చేసిన రోహిత్ శర్మ, అంపైర్ నిర్ణయం ప్రకటించిన వెంటనే రివ్యూ తీసుకున్నా లాభం లేకపోయింది. రోహిత్ శర్మ అవుట్ అయ్యే సమయానికి 115/5 వద్ద ఉన్న టీమిండియా, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే 3 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఆ తర్వాత జో రూట్ వేసిన తొలి బంతికే రిషబ్ పంత్, కీపర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 117 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయింది భారత జట్టు. టీమిండియా కోల్పోయిన 5 వికెట్లలో నాలుగు వికెట్లు జాక్ లీచ్ బౌలింగ్‌లోనే కావడం విశేషం. జాక్ లీచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి. 

click me!