సున్నాకే రెండు వికెట్లు... అక్షర్ పటేల్ సంచలన ప్రదర్శన...

Published : Feb 25, 2021, 04:41 PM IST
సున్నాకే రెండు వికెట్లు... అక్షర్ పటేల్ సంచలన ప్రదర్శన...

సారాంశం

క్రావ్లే, బెయిర్ స్టో డకౌట్... మూడు బంతుల్లో రెండు వికెట్లు తీసిన అక్షర్ పటేల్...

టీమిండియాను 145 పరుగులకే ఆలౌట్ చేసిన సంతోషం, ఇంగ్లాండ్ జట్టుకి ఎక్కువ సేపు నిలవలేదు. రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన మొదటి మూడు బంతుల్లోనే రెండు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. మొదటి బంతికే క్రావ్లే వికెట్ తీసిన అక్షర్ పటేల్, ఆ తర్వాత మూడో బంతికి జానీ బెయిర్‌స్టోను క్లీన్ బౌల్డ్ చేశాడు.

రెండో బంతికి బెయిర్ స్టో అవుట్ అయినట్టు అంపైర్ ప్రకటించినా, రివ్యూ బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు కనిపించడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బతికిపోయాడు. అయితే ఆ తర్వాతి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు బెయిర్ స్టో.. 

ఐదో బంతికి సింగిల్ తీసిన జో రూట్, ఇంగ్లాండ్ జట్టుకి తొలి పరుగు అందించాడు. తొలి ఓవర్ ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 1 పరుగు చేసింది ఇంగ్లాండ్.

PREV
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ