ఈ ప్రపంచ కప్ టీమిండియాదే... కానీ ఈ ఫార్ములాను పాటిస్తేనే: రాహుల్ ద్రవిడ్

By Arun Kumar PFirst Published May 20, 2019, 7:44 PM IST
Highlights

క్రికెట్ ప్రియులు ఎప్పెడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసిసి వన్డే వరల్డ్ కప్ మరో పది రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ నెల 30వ తేదీ నుండి ఇంగ్లాండ్ వేదికగా జరిగే ఈ మెగాటోర్నీ గురించే ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది.  ఈ ప్రపంచ కప్ లో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో పాల్గొనే టీమిండియా ఆటగాళ్లతో పాటు భారత,విదేశీ మాజీలు, విశ్లేషకులు కూడా గెలుపు మనదేనని చెబుతున్నారు. ఇలా భారత్ ప్రపంచ విజేతగా నిలుస్తున్న వారి జాబితాలోకి తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ చేరిపోయారు. 

''ఇండియా ''ఎ'' టీంతో కలిసి గత సంవత్సరం ఇంగ్లాండ్ లో పర్యటించాను. కాబట్టి క్రికెటర్ గా రిటైరైనా అక్కడ వాతావరణ పరిస్థితులు, పిచ్ ల గురించి నాకు అవగాహన వుంది. కాబట్టి నేను  చెప్పేదేంటంటే...ఈ ప్రపంచ కప్ లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం వుంది. కాబట్టి ఇన్నింగ్స్ ఆరంభం, చివర్లో మాత్రమే వికెట్లు పడగొడతామంటే సరిపోదు. మిడిల్ ఓవర్లలోనూ విరామం లేకుండా వికెట్లు పడగొట్టే సత్తా వున్న జట్టునే విజయం వరిస్తుంది. అదృష్టవశాత్తు టీమిండియాలో అలాంటి మెరుగైన బౌలర్లున్నారు. 

ముఖ్యంగా జస్ప్రీత్ సింగ్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, యజవేందర్ చాహల్ వంటి వికెట్ టేకింగ్ బౌలర్లు జట్టులో వుండటం మన బలం. కాబట్టి భారీ స్కోరు చేయనీయకుండా మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాట్ మెన్స్ ని అడ్డుకోవడంలో వీరు సఫలీకృతం అవుతారన్న నమ్మకం వుంది. '' అంటూ ద్రవిడ్ టీమిండియా బౌలర్లపై ప్రశంసలు  కురిపించారు. 

ఇక టీమిండియా బ్యాటింగ్ విషయంలో చింతే అవసరం లేదన్నారు. కెప్టెన్ కోహ్లీ, ఉత్తమ ఫినిషర్ ధోని, హిట్టర్ రోహిత్ ల రూపంలో నాణ్యమైన బ్యాట్ మెన్స్ వున్నారన్నారు. ముఖ్యంగా ధోని భారీ ఇన్సింగ్సులు ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చడంలో దిట్ట అని...అతడి ఆటతీరు గురించి తానే అండర్ 19 ఆటగాళ్లకు చెబుతుంటానని ద్రవిడ్ తెలిపారు. మొత్తంగా ఎన్ని రకాలుగా చూసుకున్నా టీంఇండియాకే ఈ  వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా వున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. 

click me!