జాతీయ స్థాయిలో అదరగొడుతున్న తెలంగాణ బాస్కెట్ బాల్ జట్లు

By Arun Kumar PFirst Published May 20, 2019, 6:53 PM IST
Highlights

తెలంగాణకు చెందిన బాస్కెట్ బాల్ జట్లు జాతీయ స్థాయిలో రాణిస్తున్నాయి. తమిళనాడులోని కోయంబత్తూరు వేదికగా జరుగుతున్న 36వ జాతీయ యూత్ బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్ లో మన బాలబాలికల జట్లు లెవల్-1 స్థాయిలో రాణించలేకపోయినా లెవెల్ -2 లొ తమ సత్తా చాటుతున్నాయి. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఇతర రాష్ట్రాలను మట్టికరిపించి ఆరు జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. 

బాలుర విభాగంలో జరిగిన క్వార్టర్స్ ఫైనల్లో తెలంగాణ క్రీడాకారులు హిమాచల్ ప్రదేశ్ జట్టుతో  తలపడ్డారు. ఏ  దశలోనూ హిమాచల్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా దూసుకుపోతూ ఏకంగా  66-38 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత సెమి ఫైనల్లో ఉత్తరా  ఖండ్ పై కూడా అదే ఆటతీరును కనబర్చి 62-41 తేడాతో గెలిచి  ఫైనల్ కు చేరుకుంది.

ఇక బాలికల విభాగానికి వస్తే తెలంగాణ జట్టు ఆధిపత్యమే కనిపించింది. హిమాచల్ ప్రదేశ్ తో క్వార్టర్ ఫైనల్లో 61-56 స్వల్ప తేడాతో గెలిచింది. సెమిఫైనల్లోనూ అదేవిధమైన పోరాట పటిమతో బిహార్ తో తలపడి 53-50 తేడాతో గెలుపొందింది. దీంతో మహిళా జట్టు కాస్త కష్టంగానే అయినా లెవల్ -2  స్థాయిలో ఫైనల్ కు చేరింది. ఇలా ఫైనల్ కు చేరిన ఇరుజట్ల క్రీడాకారులు ఫైనల్ కూడా గెలిచి తెలంగాణ రాష్ట్రం పేరు దేశవ్యాప్తంగా మారుమోగేలా చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.    

click me!