ఆస్ట్రేలియాలో భారీ విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న టీమిండియా...

By team teluguFirst Published Nov 15, 2020, 12:02 PM IST
Highlights

భారత క్రికెట్ జట్టు క్వారంటైన్‌లో ఉన్న హోటెల్‌కు 30 కిలో మీటర్ల దూరంలో విమాన ప్రమాదం...

భయభ్రాంతులకు గురైన విరాట్ సేన... అంతా సేఫ్ అని చెప్పిన బీసీసీఐ...

ఐపీఎల్ 2020 సీజన్‌ను విజయవంతంగా ముగించిన బీసీసీఐ, ఆసీస్ టూర్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న భారత క్రికెట్ జట్టు... పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఆస్ట్రేలియాలో క్వారంటైన్‌లో ఉన్న భారత క్రికెట్ జట్టుకు 30 కిలో మీటర్ల దూరంలో ఓ విమాన ప్రమాదం సంభవించింది.

సిడ్నీ ఒలింపిక్ పార్కు సమీపంలో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలిసిన భారత క్రికెట్ జట్టు భయాందోళనలకు గురైందట. క్రికెట్, ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్న క్రోమర్ పార్కులో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు ఫ్లైయింగ్ స్కూల్ స్టూడెంట్స్ గాయాలతో బయటపడ్డారు.

నవంబర్ 27 నుంచి మొదలయ్యే ఆసీస్ టూర్‌లో భారత జట్టు మూడు టీ20 మ్యాచులు, మూడు వన్డేలతో పాటు నాలుగు టెస్టు మ్యాచులు ఆడనుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి టెస్టు ముగిసిన తర్వాత పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశానికి బయలుదేరి రానున్నాడు.

click me!