ధోనీ, జడేజా, డుప్లిసిస్, అంబటి రాయుడు... చిల్డ్రెన్స్ డే రోజున క్యూట్ వీడియో షేర్ చేసిన సీఎస్‌కే...

By team teluguFirst Published Nov 14, 2020, 3:05 PM IST
Highlights

మాకెంతో ఇష్టమైన CUBG స్క్వాడ్‌ను బాగా మిస్ అవుతున్నాం... అంటూ క్యూట్ వీడియో షేర్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్..

జీవా సింగ్ ధోనీతో పాటు రాయుడు, బ్రావో, వాట్సన్, రవీంద్ర జడేజా అల్లరి దృశ్యాలతో వీడియో... 

యంగ్ ప్లేయర్ సామ్ కుర్రాన్‌ను కూడా కలిపేసి... 

ఐపీఎల్ 2020 సీజన్ విజయవంతంగా ముగిసినప్పటికీ ఆయా ఫ్రాంఛైజీల సోషల్ మీడియా అకౌంట్లు మాత్రం ఇంకా యాక్టీవ్‌గానే ఉన్నాయి. ఆటగాళ్లకి సంబంధించిన పాత ఫోటోలు, వీడియోలు, మూమెంట్లను షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ ఉన్నాయి. తాజాగా అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఓ క్యూట్ వీడియోను షేర్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్.

‘మాకెంతో ఇష్టమైన CUBG స్క్వాడ్‌ను బాగా మిస్ అవుతున్నాం. ఈ క్యూట్ మెమోరీస్ మీ హృదయాలను హత్తుకుంటాయని భావిస్తున్నాం’ అంటూ ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసింది సీఎస్‌కే.
మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జివా సింగ్ బైక్ నడిపే సీన్ నుంచి ఈ వీడియో మొదలవుతుంది.

 

Our most beloved CUBG squad was missed so very much this time around. Let these cute memories melt your hearts until the next one. 😍🦁💛 pic.twitter.com/B7RwI2lR5j

— Chennai Super Kings (@ChennaiIPL)

 

ఆ తర్వాత బ్రావో, కోచ్ బాలాజీ, ప్లేయర్ షేన్ వాట్సన్, రైనా, మిగిలిన ప్లేయర్లు, స్టాఫ్ సభ్యుల పిల్లలు చేసే అల్లరి, వారితో కలిసి ఆడుకునే సందర్భాలతో ఈ వీడియోను నింపేశారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ యంగ్ ప్లేయర్ సామ్ కుర్రాన్‌ను కూడా పిల్లాడిగా చూపిస్తూ చిల్ట్రెన్స్ డే విషెస్ తెలిపింది సీఎస్‌కే.

click me!