Ravindra Jadeja Cricket Records : రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన క్రికెటర్. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ గా భారత్ కు అనేక విజయాలు అందించిన జడేజా.. ఇప్పుడు మరో అరుదైన రికార్డు సాధించే దిశగా ముందుకు సాగుతున్నాడు.
Ravindra Jadeja Cricket Records : ప్రపంచ నంబర్-1 టెస్ట్ ఆల్‌రౌండర్ గా కొనసాగుతున్న భారత స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా తన అంతర్జాతీయ కెరీర్‌లో పెద్ద మైలురాయిని సాధించే దిశగా దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు డబుల్ సెంచరీ పూర్తి చేసిన జడేజా.. ట్రిఫుల్ సెంచరీ సాధించేందుకు ఆరడుగుల దూరంలో ఉన్నాడు. సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్‌లతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కు భారత జట్టును ఇంకా ప్రకటించలేదు. అయితే, బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో జడేజా ఆడుతున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో అతను కేవలం 6 మంది భారత క్రికెటర్లు మాత్రమే సాధించగలిగిన ఏకైక ట్రిపుల్ సెంచరీ వికెట్లు పూర్తి చేసే అవకాశం ఉంటుంది.
జడేజా ట్రిపుల్ సెంచరీ వికెట్లు..
undefined
భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్‌లో జడేజా మరో ఆరు వికెట్లు తీస్తే రెడ్ బాల్ ఫార్మాట్‌లో తన 300 టెస్ట్ వికెట్లు పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ సూపర్ రికార్డుకు జడేజా కేవలం 6 వికెట్ల దూరంలో ఉన్నాడు. జడేజా ఇప్పటి వరకు 72 టెస్టుల్లో 294 వికెట్లు తీశాడు. 300 వికెట్లు పూర్తి చేస్తే టెస్టుల్లో 300 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఏడవ భారత బౌలర్ గా నిలుస్తాడు.
300+ వికెట్లు తీసిన భారత బౌలర్లు
ఇప్పటి వరకు భారత్ తరఫున కేవలం ఆరుగురు బౌలర్లు మాత్రమే టెస్టుల్లో 300 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయగలిగారు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే (619 వికెట్లు) టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ (516 వికెట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (434 వికెట్లు) ఉన్నాడు. నాల్గో స్థానంలో మాజీ వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (417 వికెట్లు) ఉండగా, ఐదో స్థానంలో ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ (311 వికెట్లు) నిలిచాడు. ఆరో స్థానంలో మాజీ స్వింగర్ జహీర్ ఖాన్ (311 వికెట్లు) ఉన్నాడు.
జడేజా 'డబుల్' సెంచరీ మార్కు..
జడేజా వికెట్లతో ట్రిపుల్ సెంచరీ చేయడంతో పాటు మరో డబుల్ సెంచరీ రికార్డును కూడా నమోదుచేసే అవకాశముంది. జడేజా ఇప్పటి వరకు వన్డే ఫార్మాట్‌లో 197 మ్యాచ్‌లు ఆడాడు. మరో 3 మ్యాచ్‌లు ఆడటంతో 200 వన్డే మ్యాచ్‌లు ఆడిన భారత దిగ్గజ క్రికెటర్ల జాబితాలో చేరుతాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పేర్లతో సహా ఇప్పటివరకు 200 లేదా అంతకంటే ఎక్కువ వన్డే మ్యాచ్‌లు ఆడడంలో కేవలం 14 మంది భారత క్రికెటర్లు మాత్రమే ఉన్నారు. భారత్ తరఫున అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. తన కెరీర్‌లో 463 వన్డే మ్యాచ్‌లు ఆడాడు.
రవీంద్ర జడేజా అంతర్జాతీయ కెరీర్
జడేజా అంతర్జాతీయ కెరీర్ 2009లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో మొదలైంది. వన్డే అరంగేట్రం చేసిన ఒక రోజు తర్వాత జడ్డూ భాయ్ టీ20 ఇంటర్నేషనల్‌లో అరంగేట్రం చేసే అవకాశాన్ని పొందాడు. 2012లో ఇంగ్లండ్‌తో జడేజా తన తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. టెస్టు ఫార్మాట్‌లో జడేజా 294 వికెట్లు తీశాడు. వన్డేల్లో 220 వికెట్లు, టీ20లో 54 వికెట్లు తీశాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో జడేజా సభ్యుడుగా ఉన్నాడు. ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాత టీ20కి జడేజా వీడ్కోలు పలికాడు.