క్రికెటర్ ఆఫ్ ది ఇయర్​గా రోహిత్ శ‌ర్మ‌.. అవార్డుల్లో స‌త్తా చాటిన భార‌త క్రికెట‌ర్లు

By Mahesh Rajamoni  |  First Published Aug 22, 2024, 4:13 PM IST

Cricket Awards : భార‌త కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. రోహిత్ తో పాటు స్టార్ ప్లేయ‌ర్లు విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ, రాహుల్ ద్రవిడ్ కూడా అవార్డు గ్రహీతల జాబితాలో ఉన్నారు.
 


CEAT Cricket Awards : సియ‌ట్ (CEAT) క్రికెట్ అవార్డుల‌లో భార‌త క్రికెట‌ర్లు స‌త్తా చాటారు. భార‌త కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పురుషుల అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. అలాగే, భార‌త స్టార్ ప్లేయ‌ర్లు విరాట్ కోహ్లి ఉత్తమ వన్డే బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. రోహిత్ శర్మ ఆటలో అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చినందుకు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నాడు. 2023లో రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. మొత్తం 1,800 అంతర్జాతీయ పరుగులు సాధించాడు. ముఖ్యంగా వ‌న్డే క్రికెట్ లో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. రోహిత్ 52.59 సగటుతో 1,255 పరుగులు చేశాడు. ప్రపంచ కప్‌లో టీమిండియాకు రోహిత్ అందించిన సహకారం చాలా కీలకంగా ఉంది. 597 పరుగులతో ఐసీసీ టోర్నమెంట్‌లో రెండవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

బెస్ట్ వన్డే బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ గా విరాట్ కోహ్లీ

Latest Videos

undefined

టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ కూడా అవార్డును అందుకున్నాడు. వన్డేల్లో విరాట్ కోహ్లి అసాధారణ బ్యాటింగ్‌తో నిలకడగా రాణించి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లు ఆడాడు. దీంతో బెస్ట్ వన్డే బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కోహ్లీకి లభించింది. 2023లో కోహ్లీ అద్భుతమైన ఫామ్‌తో ఆరు సెంచరీలు, ఎనిమిది అర్ధసెంచరీలతో సహా 1,377 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ ప్రదర్శన వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ 2023లో క‌నిపించింది. కోహ్లీ 11 మ్యాచ్‌ల్లో 95.62 సగటుతో 765 పరుగులు చేసి టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెట‌ర్ గా నిలిచాడు. అలాగే, ప్రపంచ కప్ లో కోహ్లీ ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. ఇది క్రికెట్ చరిత్రలో గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా కోహ్లీ స్థానాన్ని మరింత పటిష్టం చేసింది.

రాహుల్ ద్రవిడ్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

భారత లెజెండ‌రీ ప్లేయ‌ర్, టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను ప్రతిష్టాత్మకమైన లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు. ఇటీవల బార్బడోస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో జట్టును విజయపథంలో నడిపించి భార‌త్ కు ఐసీసీ ట్రోఫీ అందుకోవ‌డంలో ద్ర‌విడ్ కీల‌క పాత్ర పోషించాడు. ఆటగాడిగా, కోచ్‌గా భారత క్రికెట్‌కు గణనీయమైన కృషి చేసినందుకు ద్ర‌విడ్ ఈ అవార్డును అందుకున్నారు. 

మహ్మద్ షమీకి బెస్ట్ వన్డే బౌలర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
 
2023 వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి బెస్ట్ వన్డే బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. షమీ అసాధారణ బౌలింగ్ నైపుణ్యాలు ప్ర‌ద‌ర్శించి భార‌త జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించాడు. ష‌మీ టోర్నమెంట్ అంతటా జట్టు విజయాలకు దోహదపడే అత్యుత్తమ ప్రదర్శనలు చేశాడు. 

అవార్డు గ్రహీతల పూర్తి జాబితా ఇదే..

టెస్ట్ బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ - యశస్వి జైస్వాల్

టెస్ట్ బౌలర్ ఆఫ్ ద ఇయర్ - రవిచంద్రన్ అశ్విన్

టీ20I బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ - ఫిల్ సాల్ట్

టీ20I బౌలర్ ఆఫ్ ది ఇయర్ - టిమ్ సౌథీ

స్టార్ స్పోర్ట్స్ టీ20 కెప్టెన్ అవార్డు - శ్రేయాస్ అయ్యర్ (కోల్‌కతా నైట్ రైడర్స్)

స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రతిభ చూపినందుకు అవార్డు  - బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షా

మహిళల టీ20I చరిత్రలో కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు - హర్మన్‌ప్రీత్ కౌర్

సియ‌ట్ మహిళా భారత బౌలర్ ఆఫ్ ది ఇయర్ - దీప్తి శర్మ

మహిళల టెస్టులో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ - షఫాలీ వర్మ

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ధోని టీమ్ సీఎస్కే వ‌దిలిపెట్టే టాప్-5 ప్లేయ‌ర్లు

click me!