ధోని రిటైర్మెంట్: సెలక్టర్లకు పూర్తి క్లారిటీ... అభిమానులకు మాత్రమే సస్పెన్స్

By Arun Kumar PFirst Published Jul 24, 2019, 5:38 PM IST
Highlights

మహేంద్ర సింగ్ రిటైర్మెంట్ పై బిసిసిఐ, సెలెక్షన్ కమిటీకి పూర్తి క్లారిటీ వున్నట్లు తెలుస్తోంది. స్వయంగా ధోనియే తన రిటైర్మెంట్ కు సంబంధించన సమాచారాన్న వారికి తెలియజేశాడట. అయితే అభిమానులకు మాత్రం ఈ విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.  

టీమిండియా సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ పై సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే బిసిసిఐ, టీమిండియా సెలెక్టర్లకు మాత్రం ధోని రిటైర్మెంట్ పై పూర్తి క్లారిటీ వున్నట్లు సమాచారం. స్వయంగా ధోనియే తానెప్పుడు రిటైర్ కానున్నది... అప్పటివరకు జట్టును ఎలా సంసిద్దం చేయాలో కూడా సెలెక్టర్లకు తెలిపాడట. 

ప్రపంచ కప్ తర్వాత ఒకేసారి జట్టునుండి తప్పుకుంటే టీమిండియాపై తీవ్ర ప్రబావం పడనుందనే ధోని రిటైర్మెంట్ వాయిదా వేసుకున్నాడట. ఇదే విషయాన్ని సెలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి తాను రిటైర్మెంట్ ప్రకటించకున్నా జట్టుకు దూరంగా వుంటాను. కానీ యువ ఆటగాళ్లకు అనుభవంతో కూడిన మెలకువలు నేర్చించడానికి  సిద్దమేనని  తెలిపాడు. మీరు కూడా జట్టులో తానే లేని లోటును పూడ్చటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని  ధోని సూచించాడు. 

ఇందులో భాగంగానే వెస్టిండిస్ టూర్ కు దూరంగా వుండేందుకే ధోని భారత ఆర్మీ క్యాంప్ కు వెళ్లాడు. అయితే ఈ పర్యటన కోసం భారత జట్టును ఎంపికచచేయడానికి ఒక్కరోజు ముందు ధోని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కు ఫోన్ చేసి ఈ  విషయాలన్ని చెప్పాడని సమాచారం. అతడి సూచన మేరకే యువ కిలాడి  రిషబ్ పంత్ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. 

ఇలా ధోని రిటైర్మెంట్ పై మరికొంత కాలం అభిమానుల్లో సస్పెన్స్ కొనసాగనుంది. దీనిపై ధోని గానీ, బిసిసిఐ, సెలెక్టర్లు గానీ క్లారిటీ ఇచ్చే అవకాశం  ఇప్పట్లో లేదు. కానీ వారికి మాత్రం ధోని రిటైర్మెంట్ ఎప్పుడన్నదానిపై పూర్తి క్లారిటీ వున్నట్లు తెలుస్తోంది. 
 

click me!