
జింబాబ్వేతో త్వరలో జరగనున్న వన్డే సీరిస్ కోసం భారత జట్టును బిసిసిఐ ప్రకటించింది. ఫామ్ లో లేకపోవడంతో టీమిండియా చోటు కోల్పోయిన విరాట్ కోహ్లీకి జింబాబ్వే సీరిస్ కు కూడా సెలెక్టర్లు దూరం పెట్టారు. అలాగే మరో కీలక ఆటగాడు రోహిత్ శర్మ కూడా జింబాబ్వే సీరిస్ కు దూరంపెట్టింది బిసిసిఐ. అయితే ఇటీవల వెస్టిండిస్ సీరిస్ లో మాదిరిగానే జింబాబ్వే వన్డే సీరిస్ కు మరోసారి టీమిండియా పగ్గాలను శిఖర్ ధావన్ కు అప్పగించారు సెలెక్టర్లు.
జింబాబ్వే వన్డే సీరిస్ ఆడే భారత జట్టిదే:
శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్ మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, వ అక్సఱ్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసీధ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్
ఇటీవల ముగిసిన వెస్టిండిస్ సీరిస్ లో ధావన్ సారథ్యంలోని భారత జట్టు మంచి ప్రదర్శన కనబర్చింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ తో పాటు అన్ని విభాగాల్లోనూ ధావన్ సేన రాణించడంతో మూడు వన్డేల సీరిస్ ను వైట్ వాష్ చేసింది. దీంతో ధావన్ కెప్టెన్సీపై నమ్మకంతో జింబాబ్వే వన్డే సీరిస్ బాధ్యతలు కూడా అతడికే అప్పగించింది బిసిసిఐ.
ఇక టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయాడు. ఇటీవల జరిగిన కొన్ని అంతర్జాతీయ సీరిసుల్లో కోహ్లీ ఆటతీరు పేలవంగా వుండటం, మునుపటి ఊపు తగ్గడంతో కొంతకాలంగా టీమిండియాకు దూరం కావాల్సి వచ్చింది. వెస్టిండిస్ తో జరిగిన వన్డే, టీ20 సీరిసుల్లో కూడా కోహ్లీని ఆడించకుండా విశ్రాంతి ఇచ్చింది బిసిసిఐ.
కోహ్లీ కెప్టెన్ గా తప్పుకున్న తర్వాత టీమిండియా ప్రయోగాలకు వేదికగా మారింది. ఇప్పటికే చాలామంది ఆటగాళ్ళకు కెప్టెన్సీ అవకాశాలిచ్చిన బిసిసిఐ ఇటీవల వెస్టిండిస్ పర్యటనలో ధావన్ కు ఆ ఛాన్స్ ఇచ్చింది. దీంతో అతడు ఈ వన్డే సీరిస్ బ్యాట్ మెన్ గా రాణించాడు. అతి పెద్ద వయసులో వన్డేల్లో హాఫ్ సెంచరీ చేసిన భారత కెప్టెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు శిఖర్ ధావన్. ఇంతకుముందు 1999లో కెప్టెన్‌గా చివరి హాఫ్ సెంచరీ చేసినప్పుడు మహ్మద్ అజారుద్దీన్ వయసు 36 ఏళ్ల 120 రోజులు.
వెస్టిండిస్ పర్యటనలో టీ20 కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ వన్డేలకు దూరమయ్యాడు. తాజాగా జింబాబ్వే వన్డే సీరిస్ కు అతడిని ఎంపిక చేయలేదు సెలెక్టర్లు. దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్ జింబాబ్వేతో జరిగే వన్డే సీరిస్ కు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వెస్టిండిస్ సీరిస్ తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయిన అతడు మళ్లీ భారత జట్టులో చోటుదక్కించుకున్నాడు.