CWG 2022: నమ్మండి.. ఇది నాటౌటే..! థర్డ్ అంపైర్ నిర్ణయం కూడా అదే..

Published : Jul 30, 2022, 01:18 PM IST
CWG 2022: నమ్మండి.. ఇది నాటౌటే..! థర్డ్ అంపైర్ నిర్ణయం కూడా అదే..

సారాంశం

INDW vs AUSW: కామన్వెల్త్ క్రీడలలో భాగంగా శుక్రవారం ఇండియా-ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత జట్టు 3 వికెట్ల తేడాతో ఓడింది. 

పైన కనిపిస్తున్న ఫోటోను బట్టి చూస్తే అది ఔట్ ఇవ్వాల్సిందే. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలీస్సా హీలీ.. టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మను స్టంపౌట్ చేస్తున్నదానికి సంబంధించిన ఫోటో అది. కానీ ఇది నాటౌట్. అదేంటి..? షఫాలీ క్రీజుకు చాలా దూరంలో ఉంది.  హీలీ కూడా బెయిల్స్ ను పడగొట్టింది. థర్డ్ అంపైర్ కు కూడా ఇవ్వాల్సిన పన్లేకుండా అంత స్పష్టంగా ఔట్ అని కనిపిస్తున్నప్పటికీ  నాటౌట్ గా ఇవ్వడమేంటి..? అనుకుంటున్నారా..? అక్కడే ఉంది అసలు కిటుకు.

కామన్వెల్త్ క్రీడలలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం జరిగిన టీ20 మ్యాచ్ లో ఈ వింతైన ఘటన చోటుచేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేస్తూ జోరుమీదున్న షఫాలీ వర్మ (48) ధాటిగా ఆడుతున్న క్రమంలో 9వ ఓవర్లో ఆమెను ఔట్ చేసే అవకాశం వచ్చింది.  

క్రీజు దాటి బయటకు వచ్చిన షఫాలీ వెనక్కి వచ్చేసరికి హీలీ.. బెయిల్స్ ను పడగొట్టింది. అయితే బెయిల్స్ నైతే పడగొట్టింది గానీ.. ఆ పడగొట్టిన చేతిలో బాల్ లేదు. ఎడమ చేతితో బంతిని అందుకున్న హీలీ.. కుడి చేతి మణికట్టుతో బెయిల్స్ ను పడగొట్టింది. ఆ తర్వాత మళ్లీ తన తప్పు తెలుసుకుని ఎడమ చేత్తో ఉన్న బంతితో వికెట్లను పడగొట్టబోయింది. కానీ హీలీ కుడిచేత్తో బెయిల్స్ ను పడగొట్టగానే షఫాలీ క్రీజులోకి వచ్చింది. 

 

నిబంధనల ప్రకారం  ఒక ప్లేయర్ చేతిలో బంతిని ఉంచుకుని దానిని చేతితో గానీ మణికట్టుతో గానీ పడగొడితే అది ఔట్ కిందే లెక్క. అలా కాక చేతిలో బంతి లేకున్నా.. హీలీ చేసినట్టు చేసినా అది ఔట్ కింద పరిగణించబడదు. ఈ నిబంధనే షఫాలీని ఔట్ కాకుండా కాపాడింది. ఇదిలాఉండగా ఈ మ్యాచ్ లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆసీస్.. 19 ఓవర్లలోనే విజయ తీరాలకు చేరింది. భారత పేసర్ రేణుకా ఠాకూర్.. తొలి నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసి ఆసీస్ ను భయపెట్టినా మిగిలిన బౌలర్లు భారీగా పరుగులిచ్చుకోవడంతో భారత్ కు ఓటమి తప్పలేదు. 

అరుదైన ఘనత సాధించిన హీలీ: 

ఇదిలాఉండగా ఈ మ్యాచ్ లో రెండు క్యాచులను అందుకున్నది. ఈ క్రమంలో ఆమె అరుదైన ఘనతను అందుకున్నది. టీ20లలో అత్యధికంగా 100 ఔట్ లను నమోదు చేసిన తొలి వికెట్ కీపర్ (పురుషులు, మహిళలు) గా హీలీ చరిత్ర సృష్టించింది. ఈ జాబితాలో టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని (91) రెండో స్థానంలో ఉండగా సారా టేలర్ (ఇంగ్లాండ్-74), క్వింటన్ డికాక్ (73) తర్వాత స్థానాల్లో ఉన్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు
IND vs SA : టీ20 క్రికెట్ అంటే అంతే బాసూ.. సూర్యకుమార్ యాదవ్ భయం అదే !