INDvsENG 3rd Test: 4 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా... కెఎల్ రాహుల్, పూజారా అవుట్...

Published : Aug 25, 2021, 04:04 PM IST
INDvsENG 3rd Test: 4 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా... కెఎల్ రాహుల్, పూజారా అవుట్...

సారాంశం

నాలుగు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా... జేమ్స్ అండర్సన్‌కే దక్కిన రెండు వికెట్లు...

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 4.1 ఓవర్లలో 4 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది. గత రెండు టెస్టుల్లో అదరగొట్టిన భారత ఓపెనర్ కెఎల్ రాహుల్... 4 బంతుల్లో పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు.

మొదటి ఓవర్ వేసిన అండర్సన్ బౌలింగ్‌లో బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు కెఎల్ రాహుల్...ఆ తర్వాత 9 బంతుల్లో 1 పరుగు చేసిన ఛతేశ్వర్ పూజారా కూడా అండర్సన్ బౌలింగ్‌లోనే, బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 4 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది భారత జట్టు.

అండర్సన్ బౌలింగ్‌లో పూజారా అవుట్ కావడం ఇది 10వ సారి కాగా, ఇంగ్లాండ్‌లో 8వ సారి... స్వదేశంలో జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో అత్యధిక సార్లు అవుటైన బ్యాట్స్‌మెన్‌గా పూజారా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు. 

ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్, తన తొలి మూడో ఓవర్లలో రెండు మెయిడిన్లతో కేవలం ఒకే పరుగు ఇచ్చి 2 వికెట్లు తీయడం విశేషం. క్రీజులో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి ఎంత భాగస్వామ్యం నమోదుచేస్తారనేదానిపైనే భారత జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరు ఆధారపడి ఉంది...

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే