న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఫిన్ ఆలెన్ కరోనా పాజిటివ్... బంగ్లాలో దిగిన రెండు రోజుల్లో...

By Chinthakindhi RamuFirst Published Aug 24, 2021, 4:53 PM IST
Highlights

న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఫిన్ ఆలెన్‌కి కరోనా పాజిటివ్...  బంగ్లాదేశ్‌తో ఐదు టీ20 మ్యాచుల సిరీస్ కోసం ఢాకా చేరిన న్యూజిలాండ్ జట్టు...

న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఫిన్ ఆలెన్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది. బంగ్లాదేశ్‌తో ఐదు టీ20 మ్యాచుల సిరీస్ కోసం ఢాకా చేరిన న్యూజిలాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్న ఫిన్ ఆలెన్... ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ కోర్సు పూర్తిచేసుకున్నాడు. అంతేకాకుండా ఇంగ్లాండ్‌లో ప్రీ-డిపార్చర్ టెస్టులన్నీ పాస్ అయ్యాడు. అయినా ధాకా చేరిన రెండు రోజుల్లోనే ఫిన్ ఆలెన్‌కి కరోనా పాజిటివ్ రావడం విశేషం...

సెప్టెంబర్ 1 నుంచి బంగ్లాదేశ్‌తో ఐదు టీ20 మ్యాచుల సిరీస్ ఆడే న్యూజిలాండ్... ఆ తర్వాత పాకిస్తాన్‌తో ఐదు టీ20 మ్యాచుల సిరీస్ ఆడుతుంది. బంగ్లా, పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌లతో పాటు టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి కూడా ఇప్పటికే జట్టును ప్రకటించింది న్యూజిలాండ్. 

టీ20 వరల్డ్‌కప్‌తో పాటు భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కి కేన్ విలియంసన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తే... బంగ్లా, పాకిస్తాన్‌లతో జరిగే టీ20 సిరీస్‌లకు టామ్ లాథమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. కేన్ విలియంసన్‌తో పాటు ట్రెంట్ బౌల్ట్, కేల్ జెమ్మీసన్ వంటి ప్లేయర్లు ఐపీఎల్‌లో పాల్గొంటారు. 

click me!