శ్రీకృష్ణావతరం ఎత్తిన శిఖర్ ధావన్...... ఫ్లూట్ ఊదుతూ గబ్బర్ ఫోజులు

Siva Kodati |  
Published : May 17, 2020, 02:39 PM ISTUpdated : May 17, 2020, 02:41 PM IST
శ్రీకృష్ణావతరం ఎత్తిన శిఖర్ ధావన్...... ఫ్లూట్ ఊదుతూ గబ్బర్ ఫోజులు

సారాంశం

కరోనా వైరస్ కారణంగా అన్ని దేశాలన్నీ లాక్‌డౌన్‌ మంత్రాన్ని జపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో క్రికెట్ సహా అన్ని రకాల క్రీడలు నిలిచిపోయాయి. 

కరోనా వైరస్ కారణంగా అన్ని దేశాలన్నీ లాక్‌డౌన్‌ మంత్రాన్ని జపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో క్రికెట్ సహా అన్ని రకాల క్రీడలు నిలిచిపోయాయి. ఎప్పుడూ బీజీ షెడ్యూల్‌తో క్షణం తీరిక లేకుండా గడిపే టీమిండియా క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితయ్యారు.

లాక్‌డౌన్ సమయంలో క్రికెటర్లు తమలో దాగివున్న ప్రతిభను వెలికి తీస్తున్నారు. ఇప్పటికే ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ సోషల్ మీడియాతో దుమ్ము లేపుతున్నాడు.

తాజాగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కృష్ణావతారమెత్తాడు. శ్రీకృష్ణుడిలా ఫ్లూట్ ఊదుతున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. సముద్ర తీరంలో నిల్చోని ఫ్లూట్ వాయిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతనిలో ఉన్న కొత్త కళను చూసి ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.  

శిఖర్ గతంలో కూడా తన ఫ్లూట్ వాయించే టాలెంట్‌ను చూపించాడు. కాగా లాక్‌డౌన్ విధించిన కొత్తల్లో ధావన్ తన ఇంట్లోని బాత్రూమ్స్ క్లీన్ చేస్తూ, బట్టలు ఉతుకుతున్న వీడియోను షేర్ చేశాడు. 
 

PREV
click me!

Recommended Stories

Indian Cricket: టెస్టుల్లో 300, వన్డేల్లో 200, ఐపీఎల్‌లో 100.. ఎవరీ మొనగాడు?
IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?