మాస్కు ధరించని జడేజా భార్య: ప్రశ్నించిందని.. మహిళా కానిస్టేబుల్‌తో వాగ్వాదం

Siva Kodati |  
Published : Aug 11, 2020, 07:53 PM IST
మాస్కు ధరించని జడేజా భార్య: ప్రశ్నించిందని.. మహిళా కానిస్టేబుల్‌తో వాగ్వాదం

సారాంశం

టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళా కానిస్టేబుల్‌తో ఆయన వివాదానికి దిగినట్లుగా పోలీసులు తెలిపారు. 

టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళా కానిస్టేబుల్‌తో ఆయన వివాదానికి దిగినట్లుగా పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే... జడేజా తన భార్య రివిబాతో కలిసి సోమవారం రాత్రి 9 గంటల సమయంలో కారులో వెళ్తుండగా వీరి వాహనాన్ని తనిఖీ చేసేందుకు మహిళా కానిస్టేబుల్ సోనాల్ గోసాయ్ అడ్డగించారు.

కారు డ్రైవింగ్ సీటులో జడేజా మాస్క్ ధరించి ఉన్నప్పటికీ అతని భార్య మాస్క్ ధరించలేదు. దీంతో ఎందుకు మాస్క్ ధరించలేదని ప్రశ్నించడంతో పాటు జరిమానా చెల్లించాలని సదరు పోలీస్ ఆదేశించింది.

Also Read:నాలుగు క్యాచ్‌లు మిస్... లక్కంటే ఏంటో ఆరోజే సచిన్‌కు తెలిసింది: నెహ్రా

దీంతో రవీంద్ర జడేజాకు కానిస్టేబుల్‌కు మధ్య వాదన పెరిగి వాగ్వాదానికి దిగారని, మరోవైపు రివిబా కూడా ఆమెతో దురుసుగా ప్రవర్తించినట్లు డీసీపీ తెలిపారు. అయితే తమ దర్యాప్తులో జడేజా భార్య రవిబా మాస్క్ ధరించలేదని వెల్లడైందని పోలీసులు వెల్లడించారు.

అసలు వీరి మధ్య గొడవ ఎందుకు పెద్దదయ్యిందనే విషయంపై దర్యాప్తు జరుగుతుందని ఉన్నతాధికారులు చెప్పారు. ఇద్దరి మధ్య ఘర్షణ అనంతరం మహిళా కానిస్టేబుల్ స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్చినట్లు వెల్లడించారు.

Also Read:అంబటి రాయుడిని తీసుకోక పోవడానికి కారణమిదే

ఆమె ఆరోగ్యం ప్రస్తుతం కుదటపడిందని ఇప్పుడు డిశ్చార్జ్ అయినట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఇటు  జడేజా నుంచి కానీ అటు కానిస్టేబుల్ నుంచి కానీ తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు