అంబటి రాయుడిని తీసుకోక పోవడానికి కారణమిదే

By telugu news teamFirst Published Aug 10, 2020, 2:40 PM IST
Highlights

ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన అంబటి... అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. అటు తర్వాత తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న రాయుడు.. హైదరాబాద్‌ రంజీ జట్టుకు సైతం కెప్టెన్‌గా చేశాడు.


గతేడాది జరిగిన వరల్డ్ కప్ లో భారత్ సెమీ ఫైనల్స్ లోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ సమయంలో జట్టులోకి అంబటి రాయుడిని తీసుకోలేదని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరి వరకు అంబటి.. జట్టులో తనకు అవకాశం దొరుకుతుందని ఆశగా ఎదుచూశాడు. కానీ.. చోటు దక్కలేదు.  అంబటి ప్లేస్ లో విజయ్ శంకర్ కి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత  మళ్లీ అంబటికి చోటు దక్కుతుందని భావించారు. కానీ.. అప్పుడు పంత్ కి అవకాశం ఇచ్చారు.

ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన అంబటి... అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. అటు తర్వాత తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న రాయుడు.. హైదరాబాద్‌ రంజీ జట్టుకు సైతం కెప్టెన్‌గా చేశాడు. కాగా, హెచ్‌సీఏపై అవినీతి ఆరోపణలు చేసిన రాయుడు గత కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు.

కాగా.. అప్పుడు రాయుడిని వరల్డ్ కప్ లోకి ఎందుకు తీసుకోలేదుు అనే విషయంపై మాజీ చీఫ్ సెలక్టర్ ఎంస్కే మరోసారి స్పందించాడు. ‘‘ అంబటి రాయుడు కచ్చితంగా అనుభవం ఉన్న బ్యాట్స్ మెన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మేము వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకొని అనుభవానికి పెద్ద పీట వేశాం. ఆ క్రమంలోనే అంబటి రాయుడు ఏడాది పాటు జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నాడు. అయితే వరల్డ్ కప్ కు తీసుకునే నమ్మకాన్ని అతను మాకు కల్పించలేకపోయాడు. దాంతో రాయుడిని పక్కకు పెట్టాల్సి వచ్చింది. ఇక యువ క్రికెటర్ వైపు చూడటం కూడా మంచిది కాదనుకున్నాం. ఆ టోర్నమెంట్ ఇంగ్లాండ్ లో జరుగుతుండటంతో అన్ని రకాలుగా పకడ్భందీగా వెళ్లాలని అనుకున్నాం. 2016లో జింబాబ్వే పర్యటన తర్వాత రాయుడు టెస్టు సెలక్షన్ పై ఫోకస్ చేసి ఉండాల్సింది. ఆ విషయాన్ని రాయుడికి చాలా సార్లు చెప్పాను. టెస్టు క్రికెట్ పై ఎందుకు ఫోకస్ చేయడం లేదని చాలా సార్లు అడిగాను’’ అని ఎమ్ ఎస్కే పేర్కొన్నారు. 

click me!