నాలుగు క్యాచ్‌లు మిస్... లక్కంటే ఏంటో ఆరోజే సచిన్‌కు తెలిసింది: నెహ్రా

By Siva KodatiFirst Published Aug 11, 2020, 4:44 PM IST
Highlights

2011 ప్రపంచకప్‌ సందర్భంగా పాకిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్‌కు సంబంధించి టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిశ్ నెహ్రా పలు  ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

2011 ప్రపంచకప్‌ సందర్భంగా పాకిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్‌కు సంబంధించి టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిశ్ నెహ్రా పలు  ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆ మ్యాచ్‌లో సచిన్ నక్కతోక తొక్కివచ్చాడనే చెప్పాడు.

అతను చేసిన 85 పరుగులు.. నాలుగుసార్లు పాక్ ఫీల్డర్ల క్యాచ్‌లు విడవటం ద్వారానే సాధించాడు. లక్ అంటే ఏంటో నిజంగా ఆరోజే మాస్టర్ బ్లాస్టర్‌కు తెలిసి వుంటుందని నెహ్రా అభిప్రాయపడ్డాడు.

సచిన్‌కు నెర్వెస్ నైంటీస్ ఫోబియా ఉండేదని.. కానీ పాక్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆ ఫోబియా కనిపించలేదని, కానీ ఒత్తిడి కనిపించిందని ఆశిశ్ చెప్పాడు. ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నీలో ఒక కీలక మ్యాచ్‌లో ఒత్తిడి ఉండటం సహజమని ఆయన అభిప్రాయపడ్డాడు.

కానీ తాము సెమీఫైనల్ చేరుకొని ఫైనల్‌కు చేరుకునే క్రమంలో ఒత్తిడిని అధిగమించామని నెహ్రా చెప్పాడు. కాగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరిగిన ఆ సెమీఫైనల్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 260 పరుగులు చేసింది.

అద్భుతంగా ఆడిన మాస్టర్ 85 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో మిస్బా, యూనిస్ ఖాన్, కమ్రాన్ అక్మల్, ఉమర్ అక్మల్‌లు నాలుగుసార్లు క్యాచ్‌లు జారవిడిచడంతో సచిన్ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్తాన్‌ను భారత బౌలర్లు 231 పరుగులకే పరిమితమైంది. దీంతో ఫైనల్‌లో ప్రవేశించిన టీమిండియా.. శ్రీలంకపై ఘనవిజయం సాధించి రెండోసారి విశ్వవిజేతగా ఆవిర్భవించింది. 

click me!