దక్షిణాది సినీనటితో టీమిండియా క్రికెటర్ మనీశ్ పాండే పెళ్లి

Siva Kodati |  
Published : Oct 10, 2019, 04:56 PM IST
దక్షిణాది సినీనటితో టీమిండియా క్రికెటర్ మనీశ్ పాండే పెళ్లి

సారాంశం

మరో టీమిండియా క్రికెటర్ పెళ్లిపీటలెక్కబోతున్నాడు. యువ ఆటగాడు మనీశ్ పాండే ముంబైకి చెందిన సినీనటి అర్షితా శెట్టిని పెళ్లి చేసుకున్నాడు. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వస్తున్న గుసగుసలకు ఈ జంట చెక్ పెట్టింది

మరో టీమిండియా క్రికెటర్ పెళ్లిపీటలెక్కబోతున్నాడు. యువ ఆటగాడు మనీశ్ పాండే ముంబైకి చెందిన సినీనటి అర్షితా శెట్టిని పెళ్లి చేసుకున్నాడు.

గత కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వస్తున్న గుసగుసలకు ఈ జంట చెక్ పెట్టింది. ఈ డిసెంబర్‌ 2వ తేదీని ముంబైలో ఈ జంట ఒక్కటికాబోతున్నట్లుగా సమాచారం.

ప్రస్తుతం మనీశ్ పాండే విజయ్ హజారే టోర్నీలో కర్ణాటక జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్-12 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ప్రాతినిథ్యం వహించిన మనీశ్ పాండే జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో తిరువనంతపురంలో జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌లో తలపడే భారత-ఎ జట్టుకు మొదటి వన్డేలకు మనీశ్ పాండే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: ధర్మశాలలో అదరగొట్టిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత
టీమిండియాలో నయా సంజూ శాంసన్.. పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న ఆరోన్ జార్జ్ ఎవరు?