పూణే టెస్ట్ లో రోహిత్ ఫెయిల్... నిరాశలో అభిమానులు

Published : Oct 10, 2019, 12:19 PM IST
పూణే టెస్ట్ లో రోహిత్ ఫెయిల్... నిరాశలో అభిమానులు

సారాంశం

మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఓపెనర్లుగా  మయాంక్, రోహిత్ శర్మలు మైదానంలో అడుగుపెట్టారు. కాగా.. మయాంక్ అగర్వాల్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ 10వ ఓవర్ లో ఆఖరి బంతికి కేవలం 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యాడు.  

వైజాగ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో సెంచరీలతో రోహిత్ శర్మ వీరవిహారం చేశాడు. దీంతో... రెండో టెస్టుపైన కూడా రోహిత్ పైనే అభిమానులు అందరూ ఆశలు పెట్టుకున్నారు. అయితే.... అభిమానుల ఆశలన్నీ రోహిత్ శర్మ అడియాశలు చేసేశాడు.  కేవలం 14 పరుగులకే ఔట్ అయిపోయి..  పెవీలియన్ బాట పట్టాడు. 

మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఓపెనర్లుగా  మయాంక్, రోహిత్ శర్మలు మైదానంలో అడుగుపెట్టారు. కాగా.. మయాంక్ అగర్వాల్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ 10వ ఓవర్ లో ఆఖరి బంతికి కేవలం 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యాడు.

దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ బౌలింగ్ లో కీపర్ డికాక్ కి క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ వెనుదిరిగాడు. ఈ దశలో మయాంక్, పుజారాలు జట్టుకు అండగా నిలిచాడు.
దీంతో.. 25 పరుగుల వద్దే భారత్‌కి తొలి వికెట్ చేజారినట్లయింది. విశాఖపట్నం టెస్టులో రబాడ బౌలింగ్‌లో అలవోకగా ఫుల్ షాట్స్‌ ఆడిన రోహిత్ శర్మ వరుస బౌండరీలు సాధించిన విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

టీ20 ప్రపంచకప్ ముందే పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్ టోర్నీకి దూరం.!
ఒక్కడి కోసం.. ఆ ఇద్దరిని టెస్టుల నుంచి తప్పించారా..? ఇప్పటికీ మిలియన్ డాలర్ ప్రశ్న