రెండో టెస్టులోనూ మెరిసిన మయాంక్: వరుసగా రెండో సెంచరీ

Siva Kodati |  
Published : Oct 10, 2019, 04:01 PM IST
రెండో టెస్టులోనూ మెరిసిన మయాంక్: వరుసగా రెండో సెంచరీ

సారాంశం

టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మరోసారి రెచ్చిపోయాడు. పుణే వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులోనూ సెంచరీ సాధించి తానెంటో నిరూపించుకున్నాడు. 

టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మరోసారి రెచ్చిపోయాడు. పుణే వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులోనూ సెంచరీ సాధించి తానెంటో నిరూపించుకున్నాడు. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

కెప్టెన్ నమ్మకాన్ని ఏమాత్రం వమ్ముచేయని మయాంక్ మ్యాచ్ మొదలైనప్పటి నుంచి ఆచితూచి ఆడుతూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. 57వ ఓవర్‌లో ఫిలాండర్ వేసిన ఐదో బంతిని బౌండరీకి తరలించి కెరీర్‌లో రెండో శతకం పూర్తి చేసి కొద్దిసేపటికే రబాడా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ప్రస్తుతం భారత్ 73 ఓవర్లకు గాను 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. కోహ్లీ 25, రహానే 5 పరుగులతో క్రీజులో నిలిచారు. 

కోహ్లీ 25, రహానే 5 పరుగులతో క్రీజులో నిలిచారు. మరోవైపు తొలి టెస్టులో అదరగొట్టిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ రెండో టెస్టులో నిరాశపరిచాడు. కేవలం 14 పరుగులే చేసి రబాడా బౌలింగ్‌లో ఓటయ్యాడు. అనంతరం పుజారా, మయాంక్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.
 

PREV
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో అత్యంత ఖరీదైన 6 ఆటగాళ్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?