ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పిన క్రికెటర్ అజింకా రహానే... అక్టోబర్ 2022లో రెండోసారి...

Published : Jul 23, 2022, 01:12 PM IST
ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పిన క్రికెటర్ అజింకా రహానే... అక్టోబర్ 2022లో రెండోసారి...

సారాంశం

రెండోసారి తండ్రి కాబోతున్నట్టు ప్రకటించిన అజింకా రహానే... రాధికాకి కామెంట్ల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన భారత క్రికెటర్ల సతీమణులు... 

టీమిండియా మాజీ టెస్టు వైస్ కెప్టెన్ అజింకా రహానే అభిమానులకు శుభవార్త చెప్పాడు. ‘అక్టోబర్ 2022’లో రెండోసారి తండ్రి కాబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు అజింకా రహానే... 2014లో ప్రేమించి పెళ్లి చేసుకున్న అజింకా రహానే, రాధికా దోపవ్కర్‌లకు 2019 అక్టోబర్‌లో తొలి సంతానంగా ఓ అమ్మాయి జన్మించింది. పాపకు ఆర్య అని నామకరణం చేసిన అజింకా రహానే ఫ్యామిలీ, ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటుంది...

రోహిత్ శర్మ భార్య రితికా సాజ్దే, రాధికా ఇద్దరూ మంచి స్నేహితులు. ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న సమయంలో కూడా ఈ ఇద్దరు ముంబై క్రికెటర్లు, ఫ్యామిలీస్‌తో కలిసి షికార్లు చేశారు. గర్భంతో ఉన్న రాధికా ఫోటోపై కామెంట్ ద్వారా స్పందించింది రితికా శర్మ. ‘ Cannotttt Waittttt!!! Don don (ఎదురుచూడలేకపోతున్నా.... డాన్ డాన్...) ’ అంటూ సాగదీస్తున్నట్టు కామెంట్ చేసింది రోహిత్ శర్మ సతీమణి..

జస్ప్రిత్ బుమ్రా భార్య సంజన గణేశన్, ఇషాంత్ శర్మ భార్య ప్రతిమా, రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి నారాయణ్, వృద్ధిమాన్ సాహా భార్య రోమీ, సూర్యకుమార్ యాదవ్ సతీమణి దేవిశా శెట్టి, మనీశ్ పాండే భార్య ఆశితా సూద్, నితీశ్ రాణా వైఫ్ సాచా మార్వా కూడా రాధికాకి కామెంట్ల ద్వారా శుభాకాంక్షలు తెలియచేశారు.

టీమిండియా కెప్టెన్‌గా అపజయం ఎగురని రికార్డు అజింకా రహానేది. ఆడిలైడ్ టెస్టులో భారత జట్టు ఘోర పరాజయం తర్వాత కూడా టీమిండియా అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చి 2-1 తేడాతో సిరీస్‌ని సొంతం చేసుకోగలిగిందంటే దానికి అజింకా రహానే కెప్టెన్సీయే కారణం...

మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీ చేసి, టీమిండియాకి ఘన విజయం అందించిన అజింకా రహానే... ఆ తర్వాత వరుసగా విఫలమై టీమ్‌లో చోటు కోల్పోయాడు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన అజింకా రహానే, గాయంతో ఆ తర్వాతి మ్యాచ్‌ ఆడలేదు...

ఆ గాయం నుంచి కోలుకున్నా పేలవ ఫామ్ కారణంగా సౌతాఫ్రికా టూర్ ముగిసిన తర్వాత స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో అజింకా రహానేకి చోటు దక్కలేదు. అజింకా రహానేతో పాటు సీనియర్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారాని రంజీ ట్రోఫీలో పాల్గొని ఫామ్ నిరూపించుకోవాల్సిందిగా సూచించింది బీసీసీఐ...

రంజీ ట్రోఫీలో తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన అజింకా రహానే, ఆ తర్వాత రెండుసార్లు డకౌట్ అయ్యి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో గాయపడిన అజింకా రహానే, ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టుకి అందుబాటులో లేడు... ఒకవేళ గాయపడకపోయి, టీమ్‌కి అందుబాటులో ఉన్నా ఫామ్‌ని నిరూపించుకోవడంలో ఫెయిల్ అయిన అతనికి చోటు దక్కేదా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి...

కెప్టెన్‌గా ఆరు టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన అజింకా రహానే, ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆఫ్ఘనిస్తాన్‌పై కెప్టెన్‌గా టెస్టు సిరీస్ గెలిచిన అజింకా రహానే, ఆస్ట్రేలియా టూర్ మధ్యలో విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ కింద స్వదేశానికి వెళ్లిపోవడంతో మిగిలిన మూడు మ్యాచులకు సారథిగా వ్యవహరించాడు..

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IPL Mini Auction 2026: మినీ వేలంలో జాక్‌పాట్ కొట్టే ప్లేయ‌ర్స్ వీళ్లే... ఏకంగా రూ. 30 కోట్ల పైమాటే..
IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !