టీమిండియాకే టెస్టు ఛాంపియన్‌షిప్ గద... విరాట్ కోహ్లీ సారథ్యంలో ఐదోసారి...

Published : Mar 31, 2021, 06:50 AM IST
టీమిండియాకే టెస్టు ఛాంపియన్‌షిప్ గద... విరాట్ కోహ్లీ సారథ్యంలో ఐదోసారి...

సారాంశం

2017 నుంచి వరుసగా ఐదో టెస్టు గదను స్వీకరించనున్న విరాట్ కోహ్లీ... టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొట్టనున్న భారత జట్టు...

ఆస్ట్రేలియా టూర్‌లో ఆస్ట్రేలియాను 2-1 తేడాతో ఓడించిన టీమిండియా, స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టును 3-1 తేడాతో చిత్తు చేసి... ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లింది. ఫలితంగా ఏప్రిల్ 1న ముగిసే క్రికెట్ ఇయర్‌కి ఐసీసీ నెం.1 టెస్టు టీమ్‌గా ఉన్న టీమిండియా, టెస్టు ఛాంపియన్‌షిప్ గదను స్వీకరించనుంది.

మహేంద్ర సింగ్ ధోనీ నుంచి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు స్వీకరించినప్పుడు భారత జట్టు టెస్టు ర్యాంకు ఏడు... వరుస విజయాలతో టీమిండియాను నెం.1 టీమ్‌గా నిలిపిన విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత జట్టుకి ఇది ఐదో టెస్టు ఛాంపియన్‌షిప్ గద కావడం మరో విశేషం.

2017 నుంచి వరుసగా ఐదో ఏడాది కూడా నెం.1 టెస్టు టీమ్‌గా నిలిచింది భారత జట్టు. ప్రస్తుతం ఐపీఎల్ 2021 సీజన్ కోసం సిద్ధమవుతున్న విరాట్ కోహ్లీ, ఏప్రిల్ 1న టెస్టు ఛాంపియన్‌షిప్ గదను స్వీకరించి, రాయల్ ఛాలెంజర్స్ క్యాంపుతో కలవనున్నాడు.

PREV
click me!

Recommended Stories

5 Wickets in 1 Over : W, W, W, W, W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ కొత్త చరిత్ర
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !