ఐపిఎల్ 2021: సన్ రైజర్స్ హైదరాబాదుకు గుడ్ న్యూస్

By telugu teamFirst Published Mar 30, 2021, 8:05 PM IST
Highlights

ఐపిఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాదుకు శుభవార్త అందింది. తొలి మ్యాచులకు దూరంగా ఉంటాడని భావించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా నుంచి బయలుదేరాడు.

హైదరాబాద్: ఐపిఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాదుకు శుభవార్త అందింది. ఐపిఎల్ లో పాల్గొనేందుకు సన్ రైజర్స్ హైదరాబాదు కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్వదేశం నుంచి బయలుదేరాడు. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఐపిఎల్ 2021 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. 

తొలి విడత మ్యాచులకు డేవిడ్ వార్నర్ దూరంగా ఉంటారని ప్రచారం సాగింది. ఈ స్థితిలో పోటీల్లో పాల్గొనేందుకు ఆయన స్వదేశం నుంచి బయలుదేరినట్లు వార్తలు వచ్చాయి. ఆస్ట్రేలియా నుంచి బయలుదేరే ముందు వార్నర్ తన కుటుంబ సభ్యులతో గడిపాడు. ఈ విషయాన్ని ఆనయ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. తన కుటుంబ సభ్యులతో కూడిన ఫొటోను జత చేశాడు. 

ఏప్రిల్ 9వ తేదీన తొలి మ్యాచ్ విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ కు మధ్య జరుగుతుంది. సన్ రైజర్స్ హైదరాబాదు ఏప్రిల్ 11వ తేదీ కోల్ కతా నైట్ రైడర్స్ ను ఎదుర్కుంటుంది. తొలి మ్యాచు నుంచే వార్నర్ హైదరాబాదుకు అదుబాటులో ఉంటాడని అర్థమవుతోంది. 

ఐపిఎల్ టోర్నీలో పాల్గొనడానికి ఆటగాళ్లు భారత్ కు చేరుకుంటున్నారు. బిసిసిఐ మార్గదర్శకాల ప్రకారం లీగ్ ఆరంభానికి ముందు ఆటగాళ్లందరూ వారం రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి. 

click me!