ఆ కిక్ మరచిపోలేను: భజ్జీకి బర్త్ డే విషెస్ తెలిపిన కోహ్లీ

Siva Kodati |  
Published : Jul 03, 2020, 03:28 PM IST
ఆ కిక్ మరచిపోలేను: భజ్జీకి బర్త్ డే విషెస్ తెలిపిన కోహ్లీ

సారాంశం

భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ రోజు 40వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు బర్త్‌డే శుభాకాంక్షలు చెబుతున్నారు

భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ రోజు 40వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు బర్త్‌డే శుభాకాంక్షలు చెబుతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గ్రీటింగ్స్ చెప్పారు.

ఓ రోజు ఫుట్‌బాల్ మ్యాచ్‌ సందర్భంగా భజ్జీతో కలిసి వున్న ఫోటోను షేర్ చేశాడు. ‘‘ ఓహో భల్లే భజ్జు పా వాట్ ఏ కిక్.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ కామెంట్ పెట్టాడు. టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ సైతం ఆయనకు విషెస్ చెప్పాడు.

Also Read:సింగ్ ఈజ్ కింగ్.. భజ్జీకి యూవీ స్పెషల్ బర్త్ డే విషెస్

40 ఏట అడుగుపెడుతున్న హర్భజన్ సింగ్.. టీమిండియా మ్యాచ్ విన్నర్‌లలో ఒకరు. రెండుసార్లు డబ్ల్యూసీ విజేతగా, భారత్ తరపున 711 వికెట్లు పడగొట్టాడని కైఫ్ గుర్తుచేశాడు. 1996లో పనాజీలో జరిగిన అండర్ 19 గేమ్స్‌లో అతనిని మొదటిసారి చూశానని.. అప్పుడే భజ్జీ ప్రత్యేకంగా కనిపించాడని కైఫ్ తెలిపాడు.

మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా హర్భజన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇది నీ 40వ పుట్టినరోజో.. 47వ పుట్టినరోజో కానీ.. నీతో గడిపిన సరదా రోజులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. చాలా సార్లు మనం ఒకరి కాళ్లు మరొకరు పట్టుకుని లాగిన రోజులు ఉన్నాయి.

ఒక్కోసారి ప్యాంట్లు కూడా పట్టుకుని లాగిన సందర్భాలు ఉన్నాయి. ప్రపంచంలోనే ఉత్తమమైన సింగ్ నువ్వు.. ఈ రోజు నీకు ఎంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను  పాజీ అని యూవీ ట్వీట్ చేశారు. 100 టెస్టులు ఆడిన హార్భజన్ 400 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 260 వికెట్లు పడగొట్టాడు. 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే