కోహ్లీ సంపాదనకు కాదేది అనర్హం...ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కే కోటిన్నర

Published : Jul 24, 2019, 06:36 PM IST
కోహ్లీ సంపాదనకు కాదేది అనర్హం...ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కే కోటిన్నర

సారాంశం

ప్రస్తుతం టీమిండియా జట్టులో అత్యధిక  సంపాదన కలిగిన ఆటగాడు ఎవరంటే టక్కున వినిపించే పేరు విరాట్ కోహ్లీ. కేవలం అతడు ఇన్స్టాగ్రామ్ ద్వారా సంపాదించే ఆదాయాన్ని చూస్తేనే మన కళ్లు బైర్లుకమ్మడం ఖాయం.  

విరాట్ కోహ్లీ...ప్రస్తుతం భారత క్రికెటర్లలో అత్యధికంగా సంపాదన కలిగిన ఆటగాడు. క్రికెట్ ద్వారా వచ్చే సంపాదనే కాకుండా వివిధ వాణిజ్య ఒప్పందాలు, యాడ్స్, ప్రచార కర్తగా అతడు రెండు చేతులా  సంపాదిస్తున్నాడు. ఈ  మధ్య తన భార్య బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మతో కలిసి కూడా అతడు యాడ్స్ లో నటిస్తూ తనకున్న డిమాండ్ ను మరింత పెంచుకున్నాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన  క్రీడాకారుల జాబితాలో కోహ్లీ చేరిపోయాడు. అయితే తాజాగా అతడి ఆదాయ మార్గాల్లో మరొకటి చేరింది. అదే సోషల్ మీడియా. 

విరాట్ కోహ్లీకి  ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. కాబట్టి అతడి సోషల్ మీడియా మాద్యమాలను కూడా ఫాలో అయ్యేవారి  సంఖ్య కూడా అదే స్థాయిలో వుంటుంది. ఇలా ఒక్క ఇన్స్టాగ్రామ్ లోనే కోహ్లీకి 3.81 కోట్ల మంది పాలోవర్స్ వున్నారు. దీన్ని గుర్తించిన వ్యాపార సంస్థలు ఈ మాద్యమం ద్వారా తమ యాడ్స్ కు ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. ఇలా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక్క స్పాన్సర్డ్ యాడ్ పోస్ట్ చేయడానికి  కోహ్లీ దాదాపు కోటి ముప్పైఐదు లక్షలు వసూలు చేస్తున్నాడు. 

ఇలా కేవలం ఒక్క ఇన్స్టాగ్రామ్ ద్వారానే కోహ్లీ కోట్లు సంపాదిస్తున్నాడు. అయితే 2019సంవత్సరంలో సోషల్ మీడియా(ఇన్స్టాగ్రామ్) ద్వారా అత్యధికంగా ఆర్జిస్తున్న ఆటగాళ్ల జాబితాలో కూడా  కోహ్లీ చేరిపోయాడు. ఈ జాబితాలో  పుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో( 6 కోట్ల 72 లక్షలు)అగ్రస్థానంలో కొనసాగగా కోహ్లీ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. భారత దేశానికి చెందిన క్రీడాకారుల్లో కోహ్లీ ఒక్కడికే ఈ జాబితాలో చోటు దక్కింది. 

PREV
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ