వెస్టిండిస్ తో మ్యాచ్ లకు కోహ్లీ, బుమ్రా దూరం...

By Arun Kumar PFirst Published Jun 24, 2019, 2:13 PM IST
Highlights

ఇంగ్లాండ్ లో ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ తర్వాత టీమిండియా స్వదేశంలో వరుస సీరిస్ లను ఆడనుంది. ఈ మెగా టోర్ని ముగిసిన వెంటనే టీమిండియా పలు దేశాలతో ద్వైపాక్షిక సీరిస్ లు ఆడనుంది. ఇలా దాదాపు ఆరు నెలల పాటు వివిధ దేశాలతో జరగనున్న సీరిస్ ల షెడ్యూల్ బిసిసిఐ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇలా వెస్టిండిస్ తో జరగనున్న టీ20, వన్డే సీరిస్ లకు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌలర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రాలు దూరం కానున్నారు. ఈ మేరకు బిసిసిఐ అధికారుల నుండి అనధికారిక సమాచారం అందుతోంది.  

ఈ ప్రపంచ కప్ ముందు ఐపిఎల్, అంతకు ముందు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సీరిసుల్లో కోహ్లీ, బుమ్రాలు విరామం లేకుండా ఆడారు. అలాగే ప్రపంచ కప్ టోర్నీలో కూడా వీరిద్దరు టీమిండియా జట్టులో కీలక ఆటగాళ్లు కావడంతో విశ్రాంతినిచ్చే అవకాశం లేదు. ఇలా తీవ్రమైన వర్క్ లోడ్ తో విశ్రాంతి లేకుండా ఆడుతున్న వీరిద్దరికి వెస్టిండిస్ తో సీరీస్ ఆడించకుండా విశ్రాంతినివ్వాలని బిసిసిఐ భావిస్తున్నట్లు ఓ అధికారి తెలియజేశారు. 

వీరిద్దరే కాకుండా  ప్రపంచ కప్ ఆడుతున్న మరికొంతమంది ఆటగాళ్లపై కూడా పనిభారం ఎక్కువగానే వుందన సదరు అధికారి తెలిపారు. కాబట్టి వారికి కూడా విశ్రాంతినిచ్చే అవకాశాలపై చర్చిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే వెస్టిండిస్ సీరిస్ లో ఎవరెవరికి విశ్రాంతి కల్పిస్తున్నామో అధికారికంగా వెల్లడిస్తామని బిసిసిఐ అధికారి స్పష్టం చేశాడు. 

మరిన్ని వార్తలు

భారత్ లో ద్వైపాక్షిక సీరిస్ ల షెడ్యూల్... వైజాగ్ కు రెండు, హైదరాబాద్ కు ఒకటి

click me!