ఆస్ట్రేలియాతో వన్డే సీరిస్ కు అక్షర్ పటేల్ దూరం?: రోహిత్ శర్మ

By Arun Kumar P  |  First Published Sep 18, 2023, 2:50 PM IST

వన్డే వరల్డ్ కప్ కు ముందు ఆసియా కప్ విజేతగా నిలిచి మంచి ఊపుమీదుంది టీమిండియా. అయితే ఆ కొందరు ఆటగాళ్ల గాయాలు మాత్రం కాస్త ఆందోళన కలిగిస్తోంది. 


ముంబై :ఆసియా కప్ 2023 టోర్నీలో టీమిండియా అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను మట్టికరిపించి... ఫైనల్లో శ్రీలంకను చిత్తుచేసిన రోహిత్ సేన విజేతగా నిలిచింది. వన్డే ప్రపంచకప్ కు ముందు ఆసియా కప్ విజయం భారత జట్టులో విశ్వాసం నింపుతుంటే... మరోవైపు ఆటగాళ్ళ గాయాలు బయపెడుతున్నాయి. అక్షర్  పటేల్, శ్రేయాస్ అయ్యార్ గాయాలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక ప్రకటన చేసారు. 

వన్డే ప్రపంచకప్ కు ముందు భారత జట్టు ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సీరిస్ ఆడనుంది. సెప్టెంబర్ 22 నుండి ఈ సీరిస్ ప్రారంభంకానుంది. అయితే ఆసియా కప్ టోర్నీలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అక్షర్ పటేల్ గాయపడ్డాడు. దీంతో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ కు కూడా అతడు దూరమయ్యాడు. అయితే అక్షర్ పటేల్ కోలుకోడానికి సమయం పట్టేలా వుందని... దీంతో ఆస్ట్రేలియాతో వన్డే సీరిస్ కు దూరమయ్యే  అవకాశాలున్నాయని రోహిత్ తెలిపాడు. ఒకవేళ అక్షర్ తొందరగా కోలుకుంటే ఆసిస్ తో జరిగే మొదటి రెండు మ్యాచ్ లు ఆడకున్నా ఫైనల్ వన్డే ఆడే అవకాశాలున్నాయని తెలిపాడు. 

Latest Videos

undefined

Read More  సిరాజ్ తో 10ఓవర్లు వేయించాలనుకున్నా... కానీ కోచ్ అడ్డుకున్నారు..: కెప్టెన్ రోహిత్

ఇక శ్రేయాస్ అయ్యర్ ఆసియా కప్ లో కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడాడని... గాయంతో బాధపడుతున్న అతన్ని మిగతా మ్యాచ్ లు ఆడించలేకపోయామని రోహిత్ అన్నారు. అయితే ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే వన్డే సీరిస్ నాటికి అయ్యర్ పూర్తిగా కోలుకునే అవకాశాలున్నాయని అన్నారు. కాబట్టి అతడి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆసియా ఫైనల్ నాటికే అతడు పూర్తి ఫిట్ గా వున్నప్పటికి వివిధ కారణాలతో ఆడించలేకపోయామన్నారు. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సీరిస్ లో అయ్యర్ ఆడతాడని కెప్టెన్ రోహిత్ తెలిపారు. 

ఇక నిన్న(ఆదివారం) జరిగిన ఆసియా కప్ ఫైనల్లో ఆతిథ్య శ్రీలంకను రోహిత్ సేన మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక టాప్ ఆర్డర్ సిరాజ్ దెబ్బకు విలవిల్లాడిపోయింది. తాను వేసిన రెండో ఓవర్లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టిన సిరాజ్ మొత్తం ఆరు వికెట్లతో కెరీర్ లోనే ఉత్తమ గణాంకాలను నమోదు చేసుకున్నాడు. ఇలా సిరాజ్ మ్యాజిక్ బౌలింగ్ ముందు నిలవలేక లంక జట్టు కేవలం 15.2 ఓవర్లలో కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే స్వల్ప లక్ష్యాన్ని చేధించి ఆసియా కప్ 2023 విజేతగా నిలిచింది. 


 

click me!