ఇక ఎదురుదాడే... చిన్నస్వామి స్టేడియం అనుభవం చాలు: చాహల్

By Arun Kumar PFirst Published May 25, 2019, 3:56 PM IST
Highlights

ఇంగ్లాండ్ వేదికన జరగనున్న ప్రపంచ కప్ టోర్నీ కోసం తాము ముందునుంచే సిద్దమైనట్లు టీమిండియా యువ స్పిన్నర్ యజువేందర్ తెలిపాడు. అక్కడి ప్లాట్ పిచ్ లపై మాకు అవగాహన వుండటంతో ముందుగానే జాగ్రత్త పడ్డామని...అందువల్లే ఎలాంటి ఆందోళన లేకుండా ఇంగ్లాండ్ లో అడుగుపెట్టామన్నాడు. ప్లాట్ ట్రాక్స్ గురించి  ఎక్కువగా ఆలోచిస్తే  తప్పకుండా ఒత్తిడికి గురవుతాము కాబట్టి పిచ్ ల గురించి ఆలోచించడం లేదన్నారు. ఎలాంటి పిచ్‌లపై అయినా మెరుగైన ప్రదర్శన చేసినపుడే ఉత్తమ బౌలర్  అనిపించుకుంటారని... అలాంటి బౌలర్లు ప్రస్తుతం వరల్డ్ కప్ భారత జట్టులో వున్నారని చాహల్ పేర్కొన్నాడు. 
 
బ్యాటింగ్ పిచ్ లపై రస్సెల్స్, వార్నర్ వంటి హిట్టర్లను పరుగులు సాధించకుండా ఆపడం చాలా కష్టమన్నాడు. కానీ అలాంటివారిపై ఎదురుదాడికి దిగడం ద్వారా ఫలితాన్ని రాబట్టవచ్చు. కాబట్టి అదే పార్ములాను ఉపయోగించి ప్రత్యర్థి బ్యాట్ మెన్స్ ని సమర్థవంతంగా ఎదుర్కొంటామని చాహల్ తెలిపాడు. 

ఇక బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోని బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ లపై ఆడటం తనకెంతో ఉపయోగపడిందన్నాడు. అక్కడ ఐపిఎల్  తో పాటు అంతకు ముందు చాలా మ్యాచ్ లు ఆడినట్లు తెలిపాడు. ఇలా ఇంగ్లాండ్ పిచ్ లను పోలివుండే ఈ పిచ్ లపై ఆడటం ప్రపంచ కప్ లో తమకెంతో ఉపయోగపడనుందని  చాహల్ అభిప్రాయపడ్డాడు.  

ఐపిఎల్ వల్ల తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని...విదేశీ ఆటగాళ్లతో  కలిసి ఆడటం ఎంతో ఉపయోగకరంగా వుందన్నాడు. ఇలా అందరు ఆటగాళ్లు ఐపిఎల్ లో కలిసి ఆడటం మూలంగా అంతర్జాతీయ మ్యాచుల్లో  వారి మధ్య సాన్నిహిత్యం పెరిగిందన్నాడు. ఇది చాలా మంచి పరిణామమని...మంకీ గేట్ వంటి వివాదాలు చెలరేగకుండా ఐపిఎల్ ఉపయోగపడుతోందని చాహల్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.   
 
 ప్రపంచ కప్ వార్తలు  

2019 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. జూన్ 16న పాక్‌తో భారత్ ఢీ

click me!