ప్రపంచ కప్ 2019: పసికూన చేతిలో చిత్తుగా ఓడిన పాక్

By Arun Kumar PFirst Published May 24, 2019, 11:42 PM IST
Highlights

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ లో మన  దాయాది పాకిస్థాన్ జట్టుకు చేధు అనుభవం ఎదురయ్యింది. వార్మప్ మ్యాచుల్లో భాగంగా శుక్రవారం బిస్టల్ స్టేడియంలో పాకిస్థాన్, అప్ఘానిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పసికూన అప్ఘాన్ అద్భుతంగా పోరాడి పాక్ ను చిత్తు చేసింది. దీంతో ఇంగ్లాండ్ లో పాక్ చెత్త ప్రదర్శన మరోసారి బయటపడింది. 
 
ప్రపంచ కప్ కోసం  నిర్వహిస్తున్న ఈ వార్మప్ మ్యాచ్ లో పాక్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఓపెనర్లు తొందరగానే పెవిలియన్ కు చేరినా బాబర్ ఆజమ్ అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అతడు కేవలం 108 బంతుల్లో 112 పరుగుల చేయగా షోయబ్ మాలిక్ 44 పరుగులతో పరవాలేదనిపించాడు. దీంతో పాక్ 47.5 ఓవర్లలో 262 పరుగులు చేసి ఆలౌటయ్యింది. 

ఇలా పాక్ జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేసిన అప్ఘాన్ 263 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది. ఓపెనర్ హజ్రతుల్లా (28  బంతుల్లో 49 పరుగులు) మెరుపులు, మహ్మద్ నబీ (41 బంతుల్లో 34 పరుగులు) సహకారంతో హష్మతుల్లా షాహిది (102 బంతుల్లో 74 పరుగులు) అద్భుత పోరాటంతో జట్టును విజయతీరాలకు .చేర్చాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న  షాహిది సమయోచితంగా ఆడి మరో 3 బంతులు మిగలుండగానే అప్ఘాన్ ను గెలిపించారు. ఇలా పాక్ ను ఓడించి అప్ఘాన్ జట్టు
ఇతర దేశాలకు గట్టి హెచ్చరికలు పంపింది.

పాక్ బౌలర్లల రియాజ్ 3, వసీమ్ 2, షాదబ్ ఖాన్, హుస్నైన్ చెరో వికెట్ తీశారు. అలాగే అప్ఘాన్ బౌలర్లలో మహ్మద్ నబీ 3, రషీద్ ఖాన్, జద్రార్ చెరో రెండు, హసన్, ఆలమ్ చెరో వికెట్ పడగొట్టారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ విఫలమైన పాక్ ప్రపంచ కప్ ను ఓటమితో ఆరంభించింది. 
 
click me!