Team India : టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడుతున్నాడు. భారత టెస్టు జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు రెడ్ బాల్ క్రికెట్‌పై దృష్టి సారిస్తానని సూర్యకుమార్ యాదవ్ ఇటీవల పేర్కొన్నాడు.
Team India : రాబోయే సిరీస్ కు ముందు భారత క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడుతున్నారు. అయితే తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో గాయం కారణంగా బ్యాటింగ్‌కు రాలేదు. భారత టెస్టు జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు రెడ్ బాల్ క్రికెట్‌పై దృష్టి సారిస్తానని సూర్యకుమార్ యాదవ్ ఇటీవల పేర్కొన్నాడు. ముంబై, తమిళనాడు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్ ఫ్లాప్ కాగా, సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా బ్యాటింగ్ చేయలేదు. ఫలితంగా బుచ్చిబాబు టోర్నీలో తమిళనాడు జట్టు 286 పరుగుల తేడాతో ముంబైని ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది.
సూర్యకుమార్ యాదవ్‌కు గాయాలు..
undefined
510 పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై జట్టు నాలుగో రోజు కేవలం 223 పరుగులకే కుప్పకూలింది. ఇందులో షమ్స్ ములానీ ఒక్కరే 68 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. తమిళనాడు జట్టులో సీఏ అచ్యుత్, ఆర్ సాయి కిషోర్ చెరో మూడు వికెట్లు తీశారు. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ చేతికి గాయం కారణంగా బ్యాటింగ్ చేయలేదు. అయితే, మ్యాచ్ తర్వాత అతను బాగానే కనిపించడంతో గాయం తీవ్రంగా లేదని తేలింది. ముందుజాగ్రత్తగా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
కాగా, ముంబయి వికెట్ నష్టపోకుండా 6 పరుగులతో తన ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ముషీర్ ఖాన్ (40), దివ్యాంష్ సక్సేనా (26) తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దివ్యాన్ష్‌ను అవుట్ చేయడం ద్వారా ఆర్ సోను యాదవ్ ఈ భాగస్వామ్యాన్ని దెబ్బతీశాడు. ఆ తర్వాత ముంబై బ్యాట్స్‌మెన్‌లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. జట్టులో 40 పరుగులకు పైగా రెండు భాగస్వామ్యాలు మాత్రమే నమోదయ్యాయి.
అయ్యర్-సర్ఫరాజ్ ఫ్లాప్ షో
శ్రేయాస్ అయ్యర్ (22), సిద్ధాంత్ (28) మూడో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. ముంబై కెప్టెన్ సర్ఫరాజ్ 4 బంతులు ఆడి 0 పరుగుల వద్ద ఔటయ్యాడు. అనంతరం ములాని (68), మోహిత్ అవస్తి (0 నాటౌట్) 9వ వికెట్‌కు 46 పరుగులు జోడించారు. ములాని 96 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ములానీ ఔట్ అయిన 9వ ఆటగాడు. ముంబై జట్టులో చోటు దక్కించుకున్న భారత స్టార్ ఆటగాళ్లు తొలి ఇన్నింగ్స్‌లోనూ రాణించలేకపోయారు. అయ్యర్ 2 పరుగులు, సూర్యకుమార్ 30 పరుగులు, సర్ఫరాజ్ 6 పరుగులు మాత్రమే చేశారు. టెస్టు జట్టులోకి రావాలని చూస్తున్న సూర్య కుమార్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, శ్రేయాస్ అయ్యర్ లు పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు.

దులీప్ ట్రోపీ
ఈ వారం ప్రారంభంలో భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడాలనే తన కోరికను సూర్యకుమార్ ప్రకటించాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 బ్యాటర్లలో సూర్య ఒకరు. అంతర్జాతీయ వేదికపై పొట్టి ఫార్మాట్ లో అద్భుతమైన ఆటతో అదరగొడుతున్నాడు. వన్డే క్రికెట్ లో కూడా మంచి ప్రదర్శనలు ఇచ్చాడు. ఫిబ్రవరి 2023లో ఆస్ట్రేలియాతో ఒక టెస్టు ఆడాడు. ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం రావడంతో కేవలం ఎనిమిది పరుగులు చేశాడు. ఈ సంవత్సరం దులీప్ ట్రోఫీలో జాతీయ జట్టు ఆటగాళ్లు దేశీయ క్రికెట్‌లో ఎక్కువగా పాల్గొనాలని మాజీ బీసీసీఐ చీఫ్, ప్రస్తుత ఐసీసీ చైర్‌గా ఉన్న జే షా ఆదేశాలను అనుసరించి పలువురు జాతీయ జట్టు స్టార్‌లు దులీప్ ట్రోపీలో పాల్గొంటారు. వీరిలో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు.