Team India: రోహిత్ భాయ్.. చాలా మిస్ అవుతున్నాం.. రిషబ్ పంత్ కామెంట్స్ వైరల్

Published : Jun 08, 2025, 06:50 PM IST
cricketer rishabh pant

సారాంశం

Team India: టెస్ట్ సిరీస్‌ కోసం భారత జట్టు ఇంగ్లాండ్ చేరుకుంది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ గురించి రిషబ్ పంత్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Rishabh Pant misses Rohit Sharma: టీమిండియా ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టింది. టెస్టు సిరీస్ కోసం శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటన కోసం అక్కడికి చేరుకుంది. ఈ టూర్ లో భారత్ ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడనుంది. సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. భారత జట్టు ముంబై ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరగా, అక్కడ వికెట్‌కీపర్‌ బ్యాట్స్ మెన్ రిషభ్ పంత్‌కు అభిమానుల నుంచి పలు ప్రశ్నలు ఎదురుకాగా, పంత్ స్పందనలు వైరల్ అవుతున్నాయి.

ఒక అభిమాని, "మీరు ఇంగ్లండ్ పర్యటనలో రోహిత్ శర్మను మిస్ అవుతారా?" అని ప్రశ్నించగా, పంత్ సరదాగా స్పందిస్తూ.. "గార్డెన్‌లో తిరగడం మిస్ అవుతాను" అని జవాబిచ్చాడు. ఈ వ్యాఖ్య అభిమానుల మధ్య హాస్యంగా వైరల్ అవుతోంది. ఆ తర్వాత పంత్ అవును.. హిట్ మ్యాన్ ను మేము చాలా మిస్ అవుతాము అని చెప్పాడు.

అలాగే, రిషబ్ పంత్ 2024లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను గుర్తుచేశాడు. అప్పట్లో కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ, పిచ్‌పై ఆటగాళ్లు చురుగ్గా లేకుంటే వారిని హెచ్చరించిన సందర్భం కూడా గుర్తు చేశాడు.

ఇంగ్లాండ్ పర్యటన ముందు, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దీంతో, భారత సెలెక్షన్ కమిటీ శుభ్ మన్ గిల్‌ను కొత్త టెస్ట్ కెప్టెన్‌గా నియమించింది. రిషభ్ పంత్‌కు వైస్ కప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

ఈ పర్యటన కోసం భారత జట్టులో అనుభవజ్ఞులతో పాటు పలువురు యంగ్ ప్లేయర్లకు చోటుదక్కింది. మొత్తం 18 మంది సభ్యులతో కూడిన జట్టు ఇంగ్లండ్‌కు బయలుదేరింది.

ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు

• శుభ్ మన్ గిల్ (కెప్టెన్)

• రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్)

• యశస్వి జైస్వాల్

• కేఎల్ రాహుల్

• సాయి సుదర్శన్

• అభిమన్యు ఈశ్వరణ్

• కరుణ్ నాయర్

• నితీష్ కుమార్ రెడ్డి

• రవీంద్ర జడేజా

• ధ్రువ్ జురేల్

• వాషింగ్టన్ సుందర్

• శార్దూల్ ఠాకూర్

• జస్ప్రీత్ బుమ్రా

• మొహమ్మద్ సిరాజ్

• ప్రసిద్ధ్ క్రిష్ణ

• ఆకాశ్ దీప్

• అర్షదీప్ సింగ్

• కుల్దీప్ యాదవ్

భారత జట్టు ఇప్పటికే ఇంగ్లండ్‌లోకి అడుగుపెట్టగా, సిరీస్‌కు ముందు వర్మప్ మ్యాచులు, ప్రాక్టీస్ సెషన్లు జరుగుతున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ వంటి సీనియర్ స్టార్ ప్లేయర్లు లేని భారత జట్టు శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలో ఎలాంటి ప్రదర్శన చేస్తుందనే ఆసక్తి నెలకొంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చెత్త ఆటతో ఆ ఇద్దరిపై వేటు.. వైజాగ్ వన్డేకి టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?