IPL 2022: టాస్ గెలిచిన కేన్ విలియమ్సన్.. మరి మ్యాచో.. ఈసారైనా సన్ రైజ్ అయ్యేనా..?

Published : Mar 29, 2022, 07:10 PM IST
IPL 2022:  టాస్ గెలిచిన  కేన్ విలియమ్సన్.. మరి మ్యాచో.. ఈసారైనా సన్ రైజ్ అయ్యేనా..?

సారాంశం

TATA IPL 2022 - SRH vs RR: గతేడాది ముగిసిన ఐపీఎల్  సీజన్ లో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్.. పాత గాయాలను మరిచి కొత్త సీజన్ ను ప్రారంభించబోతున్నది. పూణె వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచుతో  గెలిచి సీజన్ ను ఘనంగా ఆరంభించాలని కోరుకుంటున్నది. 

ఐపీఎల్-2021.. సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఎన్నో గాయాలను మిగిల్చింది. విజయవంతమైన సారథిగా పేరు సంపాదించిన డేవిడ్ వార్నర్ భాయ్ ను అనూహ్యంగా సారథిగా తప్పించి ఆ తర్వాత జట్టునుంచే అవమానకరరీతిలో పంపించి అపజయాలు మూటగట్టుకున్నది ఎస్ఆర్హెచ్. పాయింట్ల పట్టికలో చిట్ట చివరన (8వ స్థానం) నిలిచింది. అయితే ఈ గాయాలను మరిచి కొత్త సీజన్ ను విజయంతో ప్రారంభించాలని ఆరెంజ్ ఆర్మీ కోరుకుంటున్నది. పూణె వేదికగా  రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న ప్రారంభ మ్యాచు (ఇరు జట్లకు)లో గెలిచి సీజన్ ను ఘనంగా ఆరంభించాలని భావిస్తున్నది. అయితే ఈ క్రమంలోనే కేన్ విలియమ్సన్ సారథ్యంలోని ఎస్ఆర్హెచ్ టాస్ కూడా  గెలిచి  తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ బ్యాటింగ్ చేయనుంది.

పేపర్ మీద చూస్తే ఎస్ఆర్హెచ్ తో పోల్చితే ఎస్ఆర్హెచ్ కంటే రాజస్థాన్ బలంగానే ఉంది. సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్.. బలమైన బ్యాటింగ్ లైనప్ తో పాటు భీకర బౌలింగ్ దాడితో  పటిష్టంగా ఉంది. మరోవైపు కేన్ విలియమ్సన్  సారథ్యంలోని సన్ రైజర్స్ మాత్రం.. పేపర్ మీదే కాదు.. జట్టుగా చూసినా  రాజస్థాన్ తో పోల్చితే కాస్త వీక్ గానే కనిపిస్తున్నది. 

 

సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, పడిక్కల్, హెట్మెయర్ తో పాటు  రియాన్ పరాగ్ రూపంలో ఆ జట్టుకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది.  అశ్విన్, చాహల్ లు స్పిన్ బాధ్యతలు మోయనున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్ వంటి నాణ్యమైన బౌలర్లు కూడా ఉన్నారు. 

ఇక ఎస్ఆర్హెచ్ విషయానికొస్తే.. నికోలస్ పూరన్, కేన్ విలియమ్సన్, మార్క్రమ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, అబ్దుల్ సమద్ బ్యాటింగ్ బాధ్యతలు మోస్తారు. భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ లు  బౌలింగ్ లో ఏ మేరకు రాణిస్తారనేది చూడాల్సిందే.  అయితే నాణ్యమైన లెగ్ స్పిన్నర్ లేని కొరత ఎస్ఆర్హెచ్ ను వేధిస్తున్నది. ఇన్నాళ్లు స్పిన్ భారాన్ని మోసిన రషీద్ ఖాన్.. ఇప్పుడు గుజరాత్ తరఫున ఆడుతున్నాడు. ఇప్పుడు స్పిన్ భారాన్ని వాషింగ్టన్ సుందర్ మోయనున్నాడు. 

ముఖాముఖి పోరు : 

- ఇరు జట్లు ఐపీఎల్ లో ఇప్పటిదాకా  15 సార్లు తలపడ్డాయి. ఇందులో 8 సార్లు ఎస్ఆర్హెచ్ గెలవగా.. 7 మ్యాచుల్లో రాజస్థాన్ విజయం సాధించింది. 

తుది జట్లు : 

సన్ రైజర్స్ హైదరాబాద్ : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్,  రొమారియో షెఫర్డ్,  భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ 

రాజస్థాన్ రాయల్స్ :  సంజూ శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, నాథన్ కౌల్టర్‌ నీల్, అశ్విన్, చాహల్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?