IPL 2022: వస్తా నీ వెనుక.. చెన్నై బాటలోనే మాజీ ఛాంపియన్లు.. ముంబైకి నాలుగో ఓటమి.. ఆర్సీబీ హ్యాట్రిక్ విక్టరీ

Published : Apr 09, 2022, 11:32 PM ISTUpdated : Apr 09, 2022, 11:40 PM IST
IPL 2022: వస్తా నీ వెనుక.. చెన్నై బాటలోనే మాజీ ఛాంపియన్లు.. ముంబైకి నాలుగో ఓటమి.. ఆర్సీబీ హ్యాట్రిక్ విక్టరీ

సారాంశం

TATA IPL 2022 - RCB vs MI: ఐపీఎల్-15 లో 5 సార్లు ఛాంపియన్లు అన్న ట్యాగ్ తో ఎంట్రీ ఇచ్చిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో వరుసగా నాలుగో మ్యాచులోనూ ఓడారు.  ఈ లీగ్ లో ఉత్తమ జట్టుగా పేరొందిన మరో ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ బాటలోనే నడుస్తూ...

తమ బౌలర్లు అద్భుతం చేస్తారని ఆశలు పెట్టుకున్న ముంబై ఇండియన్స్ అభిమానులకు నిరాశను మిగుల్చుతూ..  రోహిత్ సేన తమ పేరిట మరో ఓటమి మూటగట్టుకున్నది.  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచులో ఓడి  సీజన్ లో వరుసగా నాలుగో పరాజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్ లో దారుణంగా విఫలమైన ఆ జట్టు బౌలింగ్ లో కూడా తేలిపోయింది.152 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు.. 18.3 ఓవర్లలో సాధించింది. తక్కువ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ముంబై బౌలర్లు.. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారే గానీ వికెట్లు మాత్రం తీయలేకపోయారు. దీంతో ఆ జట్టుకు మరో ఓటమి తప్పలేదు. ఇక  ఆడిన నాలుగు మ్యాచుల్లో ఓడిన ముంబై.. ప్లేఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.  ప్లేఆఫ్స్ కు చేరాలంటే ఆ జట్టు తర్వాత ఆడబోయే 10 మ్యాచుల్లో  కనీసం 8 నెగ్గాల్సిందే. 

ఇక ముంబై నిర్దేశించిన ఈజీ టార్గెట్ (151)ను ఛేదించడానికి బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్..తొలుత నెమ్మదిగా  ఆడింది.   అనూజ్ రావత్ (47 బంతుల్లో 66.. 2 ఫోర్లు, 6 సిక్సర్లు) కాస్త బ్యాట్ ఝుళిపించినా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (24 బంతుల్లో 16) క్రీజులో నిలదొక్కుకోవడానికే ఇబ్బందిపడ్డాడు. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. పవర్ ప్లే ముగిసేసరికి బెంగళూరు.. వికెట్ నష్టపోకుండా 30 పరుగులు మాత్రమే చేయగలిగింది. 8 ఓవర్లు ముగిసేసరికి  బెంగళూరు.. వికెట్ నష్టపోకుండా 50 పరుగులు  చేసింది. 

9వ ఓవర్ వేసిన ఉనద్కత్ బౌలింగ్ లో  భారీ షాట్ కు యత్నించిన డుప్లెసిస్.. లాంగాన్ లో సూర్యకుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 50 పరగుల ఓపెనింగ్ జోడీకి బ్రేక్ పడింది.   తొలుత ధాటిగా ఆడిన రావత్ తర్వాత నెమ్మదించాడు.  అయితే 13వ ఓవర్ వేసిన  బుమ్రా బౌలింగ్ లో మిడ్ వికెట్ దిశగా సింగిల్ తీసి ఐపీఎల్ లో తన తొలి అర్థ శతకాన్ని సాధించాడు. 

ఇక డుప్లెసిస్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన   విరాట్ కోహ్లి (36 బంతుల్లో 48... 5 ఫోర్లు) దూకుడుగా ఆడాడు. గత రెండు మ్యాచుల్లో విఫలమైన  విరాట్.. ఈ మ్యాచులో సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు.  బాసిల్ తంపి వేసిన 15వ  ఓవర్ తొలి బంతికి  షాట్ ఆడిన కోహ్లి ఇచ్చిన క్యాచ్ ను బ్యాక్వర్డ్ స్క్వేర్ వద్ద బ్రెవిస్ డ్రాప్ చేశాడు. దీంతో లైఫ్ పొందిన కోహ్లి.. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు.  

మరో వైపు హాఫ్ సెంచరీ ముగిశాక  అనూజ్ రావత్ మరింత చెలరేగాడు. పొలార్డ్ వేసిన 16వ ఓవర్లో సిక్సర్ బాదిన అతడు.. ఉనద్కత్ వేసిన  17వ ఓవర్లో కూడా మరో సిక్సర్ కొట్టి బెంగళూరును విజయానికి దగ్గర చేశాడు. కానీ అదే ఓవర్లో ఐదో బంతికి రెండో పరుగు తీసే క్రమంలో రనౌట్ అయ్యాడు.  

రావత్ ప్లేస్ లో క్రీజులోకి వచ్చిన  దినేశ్ కార్తీక్ (7 నాటౌట్), కోహ్లి ఔటయ్యాక  వచ్చిన  గ్లెన్ మ్యాక్స్వెల్ (8 నాటౌట్) వరుసగా రెండు బౌండరీలు కొట్టి  విజయాన్ని అందించాడు.  

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీతయ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేసింది.  సూర్యకుమార్ యాదవ్ (68 నాటౌట్),  ఓపెనర్లు ఇషాన్ కిషన్ (26), రోహిత్ శర్మ (26) మినహా మిగిలినవారంతా దారుణంగా విఫలమయ్యారు. డెవాల్డ్ బ్రెవిస్ (8), తిలక్ వర్మ (0), పొలార్డ్ (0), రమన్దీప్ సింగ్ (6) లు చేతులెత్తేశారు. ఆర్సీబీ బౌలర్లలో హసరంగ, హర్షల్ పటేల్ లు తలో రెండు వికెట్లు తీశారు.

PREV
click me!

Recommended Stories

IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ
Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు