Shakib Al Hasan: షకిబ్ ఇంట తీవ్ర విషాదం.. అత్త మృతి.. అమ్మ, పిల్లలు ఆస్పత్రిలో.. షాక్ లో కుటుంబం

Published : Apr 09, 2022, 10:07 PM ISTUpdated : Apr 09, 2022, 10:10 PM IST
Shakib Al Hasan: షకిబ్ ఇంట తీవ్ర విషాదం.. అత్త మృతి.. అమ్మ, పిల్లలు ఆస్పత్రిలో.. షాక్ లో కుటుంబం

సారాంశం

Shakib Al Hasan Mother in Law: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్  ఇంట తీవ్ర విషాదం నెలకొంది. షకిబ్ అత్త శుక్రవారం తెల్లవారుజామున చనిపోయారు.  షకిబ్ అమ్మ కూడా ఆస్పత్రిలోనే ఉంది.

బంగ్లాదేశ్  వెటరన్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ కు బ్యాడ్ టైమ్ నడుస్తున్నది. గత కొంతకాలంగా అతడికి ఏదీ కలిసి రావడం లేదు. వృత్తిపరంగానే గాక  కుటుంబపరంగా షకిబ్ కు అంతా నిరాశే ఎదురవుతున్నది.   శుక్రవారం తెల్లవారుజామున షకిబ్ అత్త నర్గీస్ బేగమ్ తుది శ్వాస విడిచారు. ఏప్రిల్ 8  తెల్లవారుజామున 2:40 గంటలకు నర్గీస్ చనిపోయినట్టు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఒక  ప్రకటనలో తెలిపింది.   

కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న  నర్గీస్ బేగమ్..  కొద్దిరోజలుగా  ఢాకాలోని కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్ (సీఎంహెచ్)లో చికిత్స పొందుతున్నది. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె శుక్రవారం తెల్లవారుజామున మరణించినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 

 

షకిబ్ అత్తతో పాటు అతడి తల్లి షిరిన్ రెజా కూడా గుండె సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది.  అంతేగాక అతడి రెండో కూతురు ఇర్రమ్ హసన్,  చిన్న కుమారుడు ఐజా అల్ హసన్ లు న్యూమోనియాతో బాధపసుతూ  వాళ్లు కూడా ఆస్పత్రిలోనే ఉన్నారు. 

 

గత నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో రాణించిన ఈ ఆల్ రౌండర్.. టెస్టులకు మాత్రం అందుబాటులో లేడు. తన కూతురు, కుమారుడులకు  ఆరోగ్యం బాగాలేకపోవడంతో అతడు బంగ్లాదేశ్ కు తిరిగొచ్చాడు.  ప్రస్తుతం బంగ్లాదేశ్.. దక్షిణాఫ్రికాతో  టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.  ఇక ఈ ఏడాది షకిబ్  ఐపీఎల్ లో కూడా ఆడటం లేదు.  గతంలో సుదీర్ఘకాలం పాటు కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన  అతడు.. ఈసారి వేలంలో అమ్ముడుపోలేదు. 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !