కెప్టెన్ అయినంత మాత్రానా నోటికొచ్చినట్టు అంటావా..? షమీని దూషించిన గుజరాత్ సారథి పై నెటిజన్ల ఫైర్

Published : Apr 12, 2022, 12:59 PM ISTUpdated : Apr 12, 2022, 01:00 PM IST
కెప్టెన్ అయినంత మాత్రానా నోటికొచ్చినట్టు అంటావా..? షమీని దూషించిన గుజరాత్ సారథి పై నెటిజన్ల ఫైర్

సారాంశం

Hardik Pandya Abuses Shami: వరుసగా మూడు మ్యాచులు గెలిచామన్న అహంకారమో లేక  కెప్టెన్సీ దక్కిందనే అత్యుత్సాహమో తెలియదు గానీ  హార్ధిక్ పాండ్యా వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ సీజన్ లో  ఓటమి అనేదే లేకుండా వరుసగా మూడు మ్యాచులలో గెలిచిన  గుజరాత్ టైటాన్స్ సారథి హార్ధిక్ పాండ్యా వ్యవహార శైలి విమర్శలకు దారితీసింది.  జట్టులో సీనియర్ ఆటగాడైన మహ్మద్ షమీని గ్రౌండ్ లో అందరి ముందే నోటికొచ్చినట్లు వాగిన పాండ్యాపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.  కెప్టెన్ అయినంత మాత్రాన సహచర ఆటగాళ్లపై  అమర్యాదగా ప్రవర్తించడం తగదని,  కోపం మానుకోవాలని  సూచిస్తున్నారు. హార్ధిక్ తన అన్న కృనాల్  మాదిరిగా మారకుంటే బెటరని చురకలంటిస్తున్నారు. నెటిజన్ల ఆగ్రహానికి హార్ధిక్ పాండ్యా ఎందుకు గురయ్యాడంటే...? 

సోమవారం గుజరాత్ టైటాన్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడిన విషయం తెలిసిందే. అయితే 162 పరుగుల లక్ష్య ఛేదనలో   కేన్ విలియమ్సన్-అభిషేక్ శర్మలు తొలి వికెట్ కు శుభారంభాన్నిచ్చి విజయం వైపునకు నడిపించారు.  ఈ క్రమంలో హార్ధిక్ వేసిన 13 వ ఓవర్లో.. రాహుల్ త్రిపాఠి ఇచ్చిన క్యాచ్ షమీకి కొద్ది దూరంలోనే పడింది.  

పాండ్యా వేసిన అదే ఓవర్లో అప్పటికే విలియమ్సన్ వరుసగా రెండు సిక్సర్లు బాది  జోరుమీదున్నాడు. ఐదో బంతికి రాహుల్ త్రిపాఠి కట్ షాట్ ఆడగా అది కాస్తా షమీ ముందు పడింది. అతడు కాస్త ముందుకు పరిగెత్తి ఉంటే క్యాచ్ అందేది. కానీ షమీ అలా చేయలేదు. ఇదే పాండ్యాకు చిరాకు తెప్పించింది. షమీ క్యాచ్ మిస్ చేయంగానే.. హిందీలో ‘బ’తో మొదలయ్యే ఓ అసభ్యకరమైన  మాటను వాడుతూ షమీపై ఆగ్రహంగా చూశాడు పాండ్యా. అంతేగాక అప్పటికే సహనం కోల్పోయిన పాండ్యా.. షమీని చూస్తూ ఏదో అనుకుంటూ వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. 

 

షమీ తో పాటు యువ ఆటగాడు సాయి సుదర్శన్ కూడా పాండ్యా ఆగ్రహానికి గురయ్యాడు. పలుమార్లు ఫీల్డింగ్ మిస్ చేసిన  సుదర్శన్ పై  గుజరాత్ సారథి బూతు పురాణం మొదలెట్టాడు. 

ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘కెప్టెన్సీ వచ్చినంత మాత్రానా నువ్వేమైనా తోపు అనుకుంటున్నావా...? లేక నీ అన్న కృనాల్  దగ్గర తిట్ల దండకం నేర్చుకున్నావా..? నోరు అదుపులో పెట్టుకో. జట్టులో సీనియర్ ప్లేయర్ అయిన షమీపై నోటికొచ్చింది మాట్లాడుతావా..?’ అంటూ  పాండ్యాపై మండిపడుతున్నారు. 

 

మరికొందరు.. ‘నువ్వు కెప్టెన్ కూల్ ధోనిని ఆదర్శంగా తీసుకుంటా అన్నావ్ కదా.. ఏమైంది మరి. క్యాచులు మిస్ చేస్తే ధోని నీలాగే అరుస్తాడా..?  ఇదేనా నీ ఓపిక...’ అని కామెంట్స్ చేశారు. ‘అసలు నీకు కెప్టెన్ అయ్యే అర్హతే లేదు. ఏదో అదృష్టం కొద్దీ వచ్చిందది. షమీ భారత జట్టుకు చేసిన సేవలు తెలుసా.. ఆటలో భావోద్వేగాలు సహజమే. కానీ మరీ ఇంత అతి పనికిరాదు. కాస్త  ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడు..’ అని సూచిస్తున్నారు. 

పాండ్యాకూ మద్దతు.. 

ఇదే సమయంలో పలువురు పాండ్యాకు కూడా మద్దతు తెలుపుతున్నారు. కీలక సమయంలో క్యాచులు జారవిడవడం అనేది మ్యాచులో ఫలితాలను మార్చేస్తుందని, షమీ అలా చేసి ఉండకూడదని అంటున్నారు.  ఆ సందర్భంలో సీనియరా..? జూనియరా..? అన్నది విషయం కాదని  జరిగే నష్టం పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.  అయితే హార్ధిక్ కాస్త ఓపిక పట్టుంటే బాగుండేదని అంటున్నారు. 

ఇక  సోమవారం నాటి మ్యాచ్ లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం ఎస్ఆర్హెచ్.. 19.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.  

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !