IPL 2022 SRH vs GT: గుజరాత్‌ టైటాన్స్‌కి ఓటమి రుచి చూపించిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

Published : Apr 11, 2022, 11:20 PM IST
IPL 2022 SRH vs GT: గుజరాత్‌ టైటాన్స్‌కి ఓటమి రుచి చూపించిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

సారాంశం

ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... కెప్టెన్ కేన్ విలియంసన్ హాఫ్ సెంచరీ, గుజరాత్ టైటాన్స్‌కి తొలి ఓటమి... 

రెండు భారీ పరాజయాలతో ఐపీఎల్ 2022 సీజన్‌ని ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, కాస్త లేటైనా కరెక్టు టైమ్‌లోనే గాడిలో పడినట్టు కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ని చిత్తు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, నేటి మ్యాచ్‌లో ఐపీఎల్ 2022 సీజన్‌లో ఓటమి ఎరుగని గుజరాత్ టైటాన్స్‌కి పరాజయాన్ని రుచి చూపించింది... వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది ఆరెంజ్ ఆర్మీ. 

163 పరుగుల లక్ష్యఛేదనలో మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి శుభారంభం అందించారు ఓపెనర్లు. తొలి వికెట్‌కి 64 పరుగులు జోడించిన తర్వాత అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయింది సన్‌రైజర్స్. 32 బంతుల్లో 6 ఫోర్లతో 42 పరుగులు చేసిన అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

11 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి, రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో ఓ భారీ సిక్ కొట్టి కిందపడ్డాడు. గాయం కారణంగా త్రిపాఠి పెవిలియన్ చేరడంతో అతని స్థానంలో నికోలస్ పూరన్ క్రీజులోకి వచ్చాడు. 

46 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసిన కేన్ విలియంసన్, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో రాహుల్ తెవాటియాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 24 బంతుల్లో 34 పరుగులు మాత్రమే కావాలి...

అయితే ఆ ఓవర్‌లో 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు హార్ధిక్ పాండ్యా. దీంతో ఆఖరి 3 ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 28 పరుగులు కావాల్సి వచ్చాయి. లూకీ ఫర్గూసన్ వేసిన 18వ ఓవర్‌లో ఓ ఫోర్, సిక్సర్‌తో 15 పరుగులు రాబట్టాడు నికోలస్ పూరన్...

దీంతో ఆఖరి 2 ఓవర్లలో 11 పరుగులు మాత్రమే కావాల్సిన స్థితికి చేరుకుంది ఆరెంజ్ ఆర్మీ. ఆ ఓవర్‌లో 12 పరుగులు రావడంతో ఆఖరి ఓవర్‌లో మ్యాచ్‌ ముగిసింది. నికోలస్ పూరన్ 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేయగా అయిడిన్ మార్క్‌రమ్ 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా హాఫ్ సెంచరీతో మెరిసినా మరో ఎండ్‌తో వరుస వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు చేయలేకపోయింది గుజరాత్ టైటాన్స్... 

 భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్‌లో వైడ్ల రూపంలో ఏకంగా 11 పరుగులు సమర్పించాడు. భువీ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతికి మాథ్యూ వేడ్ ఫోర్ బాదగా, ఆ తర్వాతి బంతికి వైడ్ల రూపంలో 5 పరుగులు వచ్చాయి. రెండో బంతికి లెగ్ బైస్ రూపంలో పరుగు కాగా మూడో బంతి వైడ్‌గా వెళ్లింది. ఐదో బంతికి లైన్ మిస్ అయిన భువీ, 5 వైడ్లు సమర్పించాడు...

మొత్తంగా తొలి ఓవర్‌లో 9 బంతులు వేసిన భువీ, ఎక్స్‌ట్రాల రూపంలో 12 పరుగులు ఇచ్చాడు. ఇందులో వైడ్ల రూపంలో వచ్చింది 11 పరుగులు...

ఐపీఎల్ 2022 సీజన్‌లో మొదటి ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించిన జట్టుగా నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఇంతకుముందు సీఎస్‌కేపై లక్నో సూపర్ జెయింట్స్ తొలి ఓవర్‌లో 14 పరుగులు ఇవ్వగా, సన్‌రైజర్స్ దాన్ని అధిగమించింది...

అయితే రెండో ఓవర్‌లో ఇన్ ఫామ్ శుబ్‌మన్ గిల్‌ని పెవిలియన్ చేర్చాడు భువనేశ్వర్ కుమార్. భువీ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠి పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌కి అవుట్ అయ్యాడు భువీ. గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో బంతిని ఒడిసి పట్టుకున్నాడు రాహుల్ త్రిపాఠి. త్రిపాఠి పట్టిన క్యాచ్‌కి బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆశ్చర్యపోవడం విశేషం...

వన్‌డౌన్‌లో వచ్చిన యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్, టి నటరాజన్ బౌలింగ్‌లో కేన్ విలియంసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 47 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది గుజరాత్ టైటాన్స్...

19 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసిన మాథ్యూ వేడ్ కూడా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. డేవిడ్ మిల్లర్ 15 బంతుల్లో 12 పరుగులు చేసి మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో అవుట్ కాగా హార్ధిక్ పాండ్యా ఐపీఎల్‌లో 100 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు...

ఐపీఎల్‌లో అతి తక్కువ బంతుల్లో 100 సిక్సర్లు బాదిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు హార్ధిక్ పాండ్యా. ఆండ్రే రస్సెల్ 657 బంతుల్లో 100 సిక్సర్లు బాదగా, క్రిస్ గేల్ 943, హార్ధిక్ పాండ్యా 1046 బంతులను తీసుకున్నారు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 100+ సిక్సర్లు బాదిన 27వ ప్లేయర్ హార్ధిక్ పాండ్యా...

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫీల్డర్లు క్యాచులు డ్రాప్ చేయడంతో మూడు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అభినవ్ మనోహర్ 21 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేశాడు. భువీ వేసిన 19వ ఓవర్‌లో రెండు సార్లు క్యాచులు డ్రాప్ కావడంతో బతికిన అభినవ్, అదే ఓవర్‌లో రాహుల్ త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఆఖరి ఓవర్‌లో 4 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన రాహుల్ తెవాటియా రనౌట్ కాగా, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రషీద్ ఖాన్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు నట్టూ... 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !