IPL 2022: పంజాబ్ ను పడగొట్టిన ఢిల్లీ స్పిన్నర్లు.. ఈ సీజన్ లో అత్యంత తక్కువ స్కోరు చేసిన మయాంక్ సేన

Published : Apr 20, 2022, 09:17 PM IST
IPL 2022: పంజాబ్ ను పడగొట్టిన ఢిల్లీ స్పిన్నర్లు.. ఈ సీజన్ లో అత్యంత తక్కువ స్కోరు చేసిన మయాంక్ సేన

సారాంశం

TATA IPL 2022 - DC vs PBKS: గత మ్యాచ్ లో వైఫల్యాలను కొనసాగిస్తూ పంజాబ్ కింగ్స్ మరోసారి బ్యాటింగ్ లో విఫలమైంది. ప్రధాన బ్యాటర్లంతా అలా వచ్చి ఇలా వెళ్లారు. ఢిల్లీ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పంజాబ్ ను పడగొట్టారు. 

ఐపీఎల్ లో సీజన్ల వారీగా సారథులు మారిన పంజాబ్ కింగ్స్ ఆట మాత్రం మారడం లేదు.  ఇప్పటికే ఐపీఎల్-15లో ఆడిన ఆరు మ్యాచుల్లో మూడు  ఓడిన ఆ జట్టు.. మరో పరాజయం ముంగిట నిలిచింది.  ప్రధాన బ్యాటర్లంతా విఫలమైన వేళ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. పంజాబ్ బ్యాటర్లలో జితేశ్ శర్మ (32) టాప్ స్కోరర్. ఢిల్లీ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడమే గాక  సరైన సమయంలో వికెట్లు తీసి  పంజాబ్ పై ఒత్తిడి పెంచారు. ఈ సీజన్ లో అత్యంత తక్కువ స్కోరు చేసిన జట్టు (115) గా చెత్త రికార్డు నమోదు చేసింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన  పంజాబ్ కింగ్స్ తొలుత భాగానే ఆడినట్టు కనిపించినా తర్వాత తడబడింది. మయాంక్ అగర్వాల్ (15 బంతుల్లో 24.. 4 ఫోర్లు) కాస్త ధాటిగా ఆడేందుకు ప్రయత్నించినా.. శిఖర్ ధావన్ (9) మాత్రం కాన్ఫిడెంట్ గా ఆడలేకపోయాడు.  లలిత్ యాదవ్ నాలుగో ఓవర్లో నాలుగో బంతికి వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఐదో ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ బౌలింగ్ లో మూడో బంతికి మయాంక్ కూడా బౌల్డ్ అయ్యాడు. 

క్రీజులోకి వస్తూనే రెండు బౌండరీలు బాదిన జానీ బెయిర్ స్టో (9), సన్ రైజర్స్ తో జరిగిన గత మ్యాచ్ లో మెరిసిన లివింగ్ స్టోన్ (2) లు కూడా  ఎక్కువ సేపు నిలువలేకపోయారు. బెయిర్ స్టో ను ఖలీల్ అహ్మద్ ఔట్ చేయగా..  లివింగ్ స్టోన్ అక్షర్ పటేల్ బౌలింగ్ లో స్టంప్ ఔటయ్యాడు. 

 

ఆ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన  వికెట్ కీపర్ జితేశ్ శర్మ (23 బంతుల్లో 32.. 5 ఫోర్లు) పంజాబ్ ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. షారుఖ్ ఖాన్  (20 బంతుల్లో 12) తో కలిసి 30 పరుగులు జోడించాడు.  ఈ జంట నిలదొక్కుకుంటుదనుకున్న  తరుణంలో అక్షర్ పటేల్ పంజాబ్ కు మరో షాక్ ఇచ్చాడు. 13.1 ఓవర్లో జితేశ్ శర్మను  ఎల్బీడబ్ల్యూ చేశాడు.  షారుఖ్ కూడా ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో పంత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

ఇక ఆ తర్వాత వచ్చినవారిలో కగిసో రబాడా (2), నాథన్ ఎల్లిస్ (0), అర్షదీప్ సింగ్ (9) లు కూడా   బ్యాట్ కు పని చెప్పకుండానే పెవిలియన్ బాట పట్టారు. ఆఖర్లో రాహుల్ చాహర్ (12.. 1 ఫోర్, 1 సిక్సర్) పంజాబ్ స్కోరును వంద దాటించాడు. ఆఖరి ఓవర్ చివరి బంతికి అర్షదీప్ రనౌట్ అయ్యాడు.  దీంతో 115 పరుగుల వద్ద  పంజాబ్ ఇన్నింగ్స్ కు తెరపడింది. 

ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ కు 2 వికెట్లు దక్కగా.. స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, లలిత్ యాదవ్ కు తలో రెండు వికెట్లు తీశారు.  అక్షర్ పటేల్.. నాలుగు ఓవర్లు వేసి 10 పరుగులే ఇవ్వడం గమనార్హం. అక్షర్.. ఏకంగా 14 బంతులు డాట్ బాల్స్ వేశాడు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ
Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు