ఇప్పుడు యువీ ఉండి ఉంటేనా... విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల ఫన్నీ మీమ్ షేర్ చేసిన యువరాజ్ సింగ్...

By Chinthakindhi RamuFirst Published Nov 14, 2021, 4:34 PM IST
Highlights

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో గ్రూప్ స్టేజ్‌కే పరిమితమైన టీమిండియా... ఇప్పుడు యువరాజ్ సింగ్ ఉండి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేదికాదంటూ...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు మొదటి రెండు మ్యాచుల్లో తన రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో పోరాడినా, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ అయితే మరీ నీరసంగా సాగింది. ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఉండనివ్వకుండా బ్యాటింగ్ ఆర్డర్‌లో లేని పోని మార్పులు చేసి, కీ మ్యాచ్‌లో చేతులు కాల్చుకున్నట్టు అయ్యింది.  

పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేని ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లతో పాటు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ పెద్దగా ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు. దీంతో అసలైన మ్యాచ్ ఫినిషర్లు ఎమ్మెస్ ధోనీ, యువరాజ్ సింగ్ ఉండి ఉంటే, టీమిండియా పరిస్థితి వేరేలా ఉండేదని టాక్ వినిపించింది...

తాజాగా ఓ నెటిజన్, యువీ గురించి ఇలాంటి మీమ్‌ని క్రియేట్ చేశాడు. భర్త ఏదో ఆలోచిస్తుంటే, అతన్ని చూస్తున్న అనుష్క శర్మ... ‘తను కచ్ఛితంగా మరో అమ్మాయి గురించే ఆలోచిస్తూ ఉండొచ్చు...’ అని మనసులో అనుకుంటూ దిగులు పడుతూ ఉంటుంది. అయితే విరాట్ కోహ్లీ మాత్రం ‘ఇప్పుడు యువరాజ్ సింగ్ ఉండి ఉంటే, మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్‌గా ఉండేది...’ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ మీమ్‌ను యువరాజ్ సింగ్ తన ఇన్‌స్ట్రాలో షేర్ చేసి... ‘నవ్వుతున్నట్టుగా ఎమోజీలను’ జత చేశాడు..

మిడిల్ ఆర్డర్‌లో ఎమ్మెస్ ధోనీ, యువరాజ్ సింగ్ కలిసి అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పి, ఎన్నో మ్యాచుల్లో భారత జట్టుకి అద్భుత విజయాలు అందించారు. ప్రస్తుతం జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ రాణిస్తున్నా, కీలక మ్యాచుల్లో వాళ్లు విఫలమైతే నిలబడి ఇన్నింగ్స్‌ని నిర్మించగల సత్తా ఉన్న బ్యాట్స్‌మెన్ కనిపించడం లేదు.

కొన్నాళ్ల కిందటి వరకూ నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ పర్వాలేదనిపించినా, అతను ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో గాయపడిన తర్వాత జట్టుకి దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకుని, ఐపీఎల్ 2021 సీజన్‌ సెకండ్ హాఫ్‌లో ఆడాడు. అయితే శ్రేయాస్ అయ్యర్‌  స్ట్రైయిక్ రేటు, సూర్యకుమార్ యాదవ్ కంటే తక్కువగా ఉండడంతో అతన్ని టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి కేవలం స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు సెలక్టర్లు...

Read also: మూడు ఫార్మాట్స్, మూడు ఫైనల్స్, అన్నింట్లోనూ అతనే... కేన్ మామ కాస్త నీ సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పు...

ఐపీఎల్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్ గైర్హజరీతో ఇంగ్లాండ్‌తో, శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆకట్టుకున్న సూర్యకుమార్ యాదవ్, కేవలం ఐదు మ్యాచులు ఆడిన అంతర్జాతీయ అనుభవంతోనే టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో పాల్గొన్నాడు. కెఎల్ రాహుల్‌దీ ఇదే తీరు. ఐపీఎల్ 2020 సీజన్ ముందు వరకూ రిషబ్ పంత్ అన్ని ఫార్మాట్లలో వరుసగా ఫెయిల్ అవుతుండడంతో టీ20, వన్డే టోర్నీల్లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా బాధ్యతలు అందించాడు కెఎల్ రాహుల్...

ఐపీఎల్ 2020 సీజన్ ముందు వరకూ నిలకడగా రాణిస్తూ బాగానే రాణించిన కెఎల్ రాహుల్, కీలక మ్యాచుల్లో ఘోరంగా ఫెయిల్ అవుతూ భారత జట్టును కష్టాల్లోకి నెట్టేస్తున్నాడు. అందుకే టీమిండియా పేపర్ మీద బలంగా కనిపిస్తున్నా, కీలక మ్యాచుల్లో ఆ స్టార్ ప్లేయర్లు స్థాయికి తగిన పర్ఫామెన్స్ ఇవ్వడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. 

2019 లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్, త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మళ్లీ బ్యాటు పడతానని సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు యువీ. 

click me!