టాస్ గెలవడమే అదృష్టం... అలాంటిది టాస్ గెలిచి కూడా ఆఫ్ఘాన్ ఇలాంటి నిర్ణయమా...

By Chinthakindhi RamuFirst Published Oct 29, 2021, 7:49 PM IST
Highlights

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో మెజారిటీ మ్యాచుల్లో ఛేదన చేసిన జట్లకే విజయాలు... టాస్ గెలిచి కూడా బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘాన్ కెప్టెన్ మహ్మద్ నబీపై విమర్శలు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టాస్ గెలిచిన జట్లు, మరో ఆలోచన లేకుండా తొలుత ఫీల్డింగ్ చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా ఇప్పటిదాకా జరిగిన మెజారిటీ మ్యాచుల్లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లు విజయాలను అందుకున్నాయి. 

టీ20 వరల్డ్‌కప్ 2021 సూపర్ 12 రౌండ్‌లో ఇప్పటిదాకా జరిగిన 11 మ్యాచుల్లో 9సార్లు రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయం దక్కింది. యూఏఈలోని పిచ్‌లు తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకి పెద్దగా సహకరించకపోవడం, సెకండ్ ఇన్నింగ్స్ సమయానికి పిచ్ మీద తేమ, వాతావరణం బ్యాట్స్‌మెన్‌కి స్వర్గధామంగా మారుతున్నాయి. 

Latest Videos

must Read: ఇలా అయితే ఆ జట్లకి స్టార్ క్రికెటర్లు ఎలా దొరుకుతారు... ఐపీఎల్ 2022 రిటెన్షన్ పాలసీపై ఆకాశ్ చోప్రా...

ఈ కారణంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌తో పాటు పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ వంటి మ్యాచుల్లో కూడా టాస్ కీలక పాత్ర పోషించింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టుకే ఛేదనలో విజయం దక్కింది.

వెస్టిండీస్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ ఆఖరి ఓవర్, ఆఖరి బంతిదాకా సాగింది. కేవలం ఆండ్రే రస్సెల్ వేసిన ఆఖరి ఓవర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 10 పరుగులు మాత్రమే ఇవ్వడంతో పాటు ఫీల్డింగ్‌లో బంగ్లాదేశ్ చేసిన తప్పులు వారి విజయవకాశాలను ఘోరంగా దెబ్బతీశాయి. లేకపోతే ఛేదనలో బంగ్లా జట్టు విజయాన్ని అందుకునేదే...

అలాంటి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు, తొలుత బ్యాటింగ్ ఎంచుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి ప్రధాన కారణం ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ 191 పరుగుల భారీ స్కోరు చేసింది. పసికూన స్కాట్లాండ్‌ను 60 పరుగులకే ఆలౌట్ చేసి 131 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.

ఈ విజయంతో 6.5 నెట్‌రన్ రేట్ సాధించి, టీమిండియా, న్యూజిలాండ్ వంటి జట్లకే షాక్ ఇచ్చింది ఆఫ్ఘాన్. ఈ విజయం ఇచ్చిన ధీమాతోనే పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఆఫ్ఘాన్ కెప్టెన్ మహ్మద్ నబీ...

అయితే ఈ మ్యాచ్‌‌పై టాస్ సమయం నుంచి ఫిక్సింగ్ ఆరోపణలు వస్తుండడం విశేషం...  ఆఫ్ఘనిస్తాన్‌లో రాజ్యమేలుతున్న తాలిబన్లకి, పాకిస్తాన్‌ నుంచి సహయ సహకరాలు అందుతున్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య మ్యాచుల్లాగే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే మ్యాచులకు కూడా మంచి క్రేజ్ ఉంది.

Read Also: స్వదేశానికి చేరుకున్న ఆవేశ్ ఖాన్... నెట్ బౌలర్ నుంచి న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి...

2019 వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ హింస్మాతక సంఘటనలకు దారి తీసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ 227 పరుగులు చేయగా, పాకిస్తాన్ 7 వికెట్లు కోల్పోయి ఆఖరి ఓవర్‌లో విజయాన్ని అందుకుంది. దీంతో స్టేడియంలో ఆఫ్ఘాన్, పాకిస్తాన్ అభిమానులు గొడవపడ్డారు. స్టేడియం సిబ్బందిపై కూడా దాడులు జరిగాయి. 

ఈసారి కూడా మ్యాచ్‌కి కూడా సమన్వయంతో మెలగాలని, మ్యాచ్‌కి కేవలం ఓ గేమ్‌గానే చూడాలని ఆఫ్ఘాన్ అభిమానులను కోరాడు రషీద్ ఖాన్... ‘2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌ తర్వాత ఏం జరిగిందో అది దురదృష్టకరం. అలాంటి మళ్లీ రిపీట్ కాకూడదని కోరుకుంటున్నా... శాంతిగా మెలగండి.’ అంటూ కోరాడు ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్...

click me!