డ్యాన్సర్ కోహ్లీ ఈజ్ బ్యాక్... ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్ మధ్యలో స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ...

By Chinthakindhi RamuFirst Published Nov 4, 2021, 8:37 PM IST
Highlights

T20 worldcup 2021: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్ దగ్గర డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ... సోషల్ మీడియాలో వీడియో వైరల్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీని పాజిటివ్ ఎనర్జీతో ప్రారంభించాడు విరాట్ కోహ్లీ. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి, టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో హాఫ్ సెంచరీ మొట్టమొదటి భారత కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. గత ఆరు టీ20 వరల్డ్‌ కప్ టోర్నీల్లో భారత కెప్టెన్‌గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనీ, ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు...

అంతేకాకుండా టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గానూ నిలిచాడు. 2014 టీ20 వరల్డ్‌కప్, 2016 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో విరాట్ కోహ్లీ తప్ప మరో భారత బ్యాట్స్‌మెన్ 50+ స్కోరు చేయలేకపోయారు. ఆఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీలు చేయడంతో విరాట్ కోహ్లీ వరుస హాఫ్ సెంచరీలకు బ్రేక్ వేసినట్టైంది...

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ పరాజయం తర్వాత విరాట్ కోహ్లీ మాట్లాడిన మాటలు విని అందరూ షాక్ అయ్యారు. క్రీజులో రేసు గుర్రంలా, ఓ జోష్ మెషిన్‌లా కదులుతూ మిగిలిన ప్లేయర్లలో కూడా ఉత్సాహం నింపుతూ ఉంటాడు విరాట్ కోహ్లీ. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కానీ, పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కానీ అది కనిపించలేదు.

పాక్‌తో మ్యాచ్‌లో భారత బౌలర్లు ఫెయిల్ కావడం, 18 ఓవర్ల పాటు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం... భారత ఫీల్డర్లకు ఒక్కటంటే ఒక్క అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ చేయడంతో క్రీజులో విరాట్ కోహ్లీ ముఖంలో నిస్తేతం, డిస్సపాయింట్‌మెంట్ స్పష్టంగా కనిపించాయి.

అయితే ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం మునుపటి విరాట్ కోహ్లీ జోష్ కనిపించింది... గత రెండు మ్యాచుల్లో ఎదురైన అనుభవాల దృష్ట్యా, మొదటి ఓవర్ నుంచి హెల్మెట్ పెట్టుకుని, బ్యాటింగ్‌కి వెళ్లడానికి రెఢీ అయినట్టు కనిపించాడు విరాట్ కోహ్లీ...

అయితే ఓపెనర్లు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ కలిసి 140 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో విరాట్ కోహ్లీకి బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. రన్‌రేట్‌ను మరింత పెంచేందుకు వీలుగా బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకి దిగజారిన విరాట్ కోహ్లీ, వన్‌డౌన్‌లో రిషబ్ పంత్, టూ డౌన్‌లో హార్ధిక్ పాండ్యాలను బ్యాటింగ్‌కి పంపాడు...

భారత జట్టు 210 పరుగుల భారీ స్కోరు చేయడంతో పాటు భారత బౌలర్లు కూడా మూడో ఓవర్ నుంచి వికెట్లు తీయడం మొదలెట్టడంతో విరాట్ కోహ్లీ... క్రీజులో పాదరసంలా కదిలాడు. బౌండరీ లైన్ దగ్గర డ్యాన్సులు చేస్తూ, టీమిండియా ఫ్యాన్స్‌లో ఉత్సాహం పెంచేందుకు ప్రయత్నించాడు విరాట్. కోహ్లీ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...

 

This Man😂❤️
pic.twitter.com/NRDNlOOEKo

— 🔥 (@TheRevanthReddy)

ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్, విరాట్ కోహ్లీకి కెప్టెన్‌గా 30వ విజయం. మూడు (టెస్టు, వన్డే, టీ20ల్లో) ఫార్మాట్లలో 30+ విజయాలు అందుకున్న ఏకైక, మొట్టమొదటి కెప్టెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ.. 

click me!