T20 World cup: 73 పరుగులకే చాప చుట్టేసిన బంగ్లా పులులు.. జంపాకు ఐదు వికెట్లు..

By team teluguFirst Published Nov 4, 2021, 5:16 PM IST
Highlights

Australia vs Bangladesh: ఆసీస్ బౌలర్ల ధాటికి తొలుత  బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 15 ఓవర్లలో 73 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ స్పిన్నర్ జంపాకు ఐదు వికెట్లు దక్కాయి. 

టీ20 ప్రపంచకప్ (T20 World cup 2021) లో భాగంగా గ్రూప్-1 లో బంగ్లాదేశ్-ఆస్ట్రేలియా (bangladesh vs Australia) ల మధ్య జరుగుతున్న పోరులో ఆసీస్ బౌలర్లు విజృంభించారు. Australia బౌలర్ల ధాటికి తొలుత  బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ.. 15 ఓవర్లలో 73 పరుగులకే ఆలౌట్ అయింది. గ్రూప్-1లో సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడానికి దక్షిణాఫ్రికా (South Africa) తో తీవ్ర పోటీ ఎదుర్కుంటున్న ఆసీస్.. ఆ దిశగా సఫలమైనట్టే కనిపిస్తున్నది.

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే కష్టాలతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లా.. ఏ దశలోనూ కోలుకోలేదు. ఆసీస్ బౌలర్లు బంగ్లా బ్యాటర్ల భరతం పట్టారు. పట్టు విడువకుండా వరుసగా వికెట్లు తీస్తూ వచ్చిన వారిని వచ్చినట్టు పెవిలియన్ కు పంపించారు. షమీ హుస్సేన్ (19) టాప్ స్కోరర్. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా (Adam Jampa)కు ఐదు వికెట్లు దక్కగా.. స్టార్క్, హెజిల్వుడ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. 

 

What a spell from the Australian leggie 💫 | | https://t.co/r00X0zOgH1 pic.twitter.com/Ie2F2RtAsl

— ICC (@ICC)

టాస్ గెలిచిన  ఆసీస్ బంగ్లా ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.  ప్రత్యర్థి ఆహ్వానం మేరకు క్రీజులోకి వచ్చిన బంగ్లా ఓపెనర్లు ఆ జట్టుకు శుభారంభాన్ని ఇవ్వలేదు.  ఓపెనర్ లిటన్ దాస్ (0).. ఇన్నింగ్స్ మూడో బంతికే మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రెండో ఓవర్లో హెజిల్వుడ్.. వన్ డౌన్ బ్యాటర్ సౌమ్య సర్కార్ (1) ను బౌల్డ్ చేశాడు.

మూడో ఓవర్ వేసిన మ్యాక్స్వెల్.. ఐదో బంతికి ముష్ఫీకర్ (1) ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. మధ్యలో ఓపెనర్ మహ్మద్ నయీమ్ (16 బంతుల్లో 17.. 3 ఫోర్లు), షమీమ్ హుస్సేన్ (19) కాస్త ప్రతిఘటించినా అది కొద్దిసేపే. క్రమం తప్పకుండా వికెట్ల పతనానికి వాళ్లు అడ్డుకట్ట వేయలేకపోయారు. బంగ్లా బ్యాటర్లలో ఏకంగా 8 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే ఔటయ్యారు. ఈ క్రమంలో ఆ జట్టు 15 ఓవర్ల కే 73 పరుగులకు చాప చుట్టేసింది. ఇక బంగ్లాదేశ్ ఈ టీ20 ప్రపంచకప్ లో వంద లోపే ఆలౌటవడం ఇది రెండో సారి. గత మ్యాచ్ లో ఆ జట్టు దక్షిణాఫ్రికా చేతిలో 84 పరుగులకే ఆలౌట్ అయింది.   

ఇక ఇన్నింగ్స్ ఆరంభంలో స్టార్క్, హెజిల్వుడ్ ఇచ్చిన స్ఫూర్తితో స్పిన్నర్ ఆడమ్ జంపా రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే  T20 World cupలో ఉత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. 4 ఓవర్లు వేసిన జంపా.. 19 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. 

click me!