టీ20 వరల్డ్‌కప్ 2021 కోసం మరో ఐదుగురు ప్లేయర్లు... 23 మందితో యూఏఈకి శ్రీలంక...

By Chinthakindhi RamuFirst Published Oct 1, 2021, 8:10 PM IST
Highlights

మొత్తంగా 23 మంది ప్లేయర్లతో యూఏఈ చేరుకోనున్న శ్రీలంక క్రికెట్ జట్టు... టీ20 వరల్డ్‌కప్ జట్టులో మరో ఐదుగురు ప్లేయర్లకు చోటు ఇచ్చిన లంక బోర్డు... 

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ఇప్పటికే 15 మంది ప్లేయర్లు, నలుగురు రిజర్వు ప్లేయర్లతో కూడిన జట్టును ప్రకటించిన శ్రీలంక, ఇప్పుడు మరో ఐదుగురు ప్లేయర్లను జత చేసింది. అంటే మొత్తంగా 23 మంది ప్లేయర్లతో యూఏఈ చేరుకోనుంది శ్రీలంక క్రికెట్ జట్టు.

వాస్తవానికి కరోనా ప్రోటోకాల్, బయో బబుల్ జోన్ కారణంగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి కేవలం 15 మంది ప్లేయర్లను మాత్రమే అనుమతిస్తామని చెప్పింది ఐసీసీ... అదనంగా వచ్చే ప్లేయర్ల ఖర్చులను సొంత బోర్డులే భరించాల్సి ఉంటుంది...

ఆ లెక్కన శ్రీలంక జట్టు, ఏకంగా 8 మంది ప్లేయర్లకు సంబంధించిన ఖర్చులన్నీ భరించాల్సి ఉంటుంది.  గత రెండేళ్లుగా టీ20ల్లో పేలవ ప్రదర్శన కారణంగా సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించలేకపోయింది శ్రీలంక జట్టు... 

టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచిన కెప్టెన్ దసున్ శనక, టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీలో లంక జట్టును నడిపించబోతున్నాడు... గ్రూప్ ఏలో ఉన్న శ్రీలంక జట్టు... సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించేందుకు ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియాతో పోటీపడనుంది.

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి శ్రీలంక జట్టు: దసున్ శనక, కుశాల్ పెరేరా, అవిష్క ఫెర్నాండో, భనుక రాజపక్ష, ధనంజయ డి సిల్వ, చరిత్ అసలంక, వానిందు హసరంగ, ఛమిక కరుణరత్నే, అఖిల ధనంజయ, మహేష్ తీక్షణ, దినేశ్ చండిమల్, ప్రవీణ్ జయవిక్రమ, కమిందు మెండీస్, బినుర ఫెర్నాండో

రిజర్వు ప్లేయర్లుగా నువాన్ ప్రదీప్, లహీరు కుమార, లహీరు మధుశంక, పులిన తరంగలను తొలుత టీ20 వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేసింది శ్రీలంక. ఇప్పుడు వీరితో పాటు అదనంగా పథుమ్ నిస్సంక, మినోద్ భనుక, అషెన్ బండారా, సందకన్, రమేశ్ మెండీస్...  యూఏఈ బయలుదేరనున్నారు. 

click me!