టీ20 వరల్డ్‌కప్‌కి ముందు పాక్‌కి ఎదురుదెబ్బ... సోహెబ్ మక్సూద్‌కి గాయం, షోయబ్ మాలిక్‌‌కి అవకాశం...

By Chinthakindhi RamuFirst Published Oct 9, 2021, 3:30 PM IST
Highlights

వెన్ను గాయంతో బాధపడుతున్న సోహెబ్ మక్సూద్... మక్సూద్ స్థానంలో పాక్ మాజీ కెప్టెన్, సీనియర్ మోస్ట్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్‌కి టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కే ఛాన్స్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ముందు పాకిస్తాన్ క్రికెట్‌లో హై డ్రామా నడుస్తూనే ఉంది. ఉన్న సమస్యలు చాలన్నట్టు ఇప్పుడు గాయాలు కూడా ఆ జట్టును వేధిస్తున్నాయి. టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ముందు వెన్నుగాయంతో బాధపడుతున్న సోహెబ్ మక్సూద్, మెగా టోర్నీకి దూరమయ్యాడు.

34 ఏళ్ల మక్సూద్‌కి పాక్ దేశవాళీ టీ20 క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. మక్సూద్ స్థానంలో పాక్ మాజీ కెప్టెన్, సీనియర్ మోస్ట్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్‌కి టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కుతుందని భావిస్తున్నారు క్రికెట్ పండితులు...

ఒకవేళ షోయబ్ మాలిక్‌కి అవకాశం వస్తే, మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ 2007 నుంచి, 2021 వరకూ కొనసాగుతున్న అతికొద్ది ప్లేయర్లలో ఒకడిగా రికార్డు క్రియేట్ చేస్తాడు...టీ20 వరల్డ్‌కప్‌కి ముందు పాక్ జట్టులో హైడ్రామా మొదలైంది...  

టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టుతో అసంతృప్తి చెందిన పాక్ మాజీ కోచ్ మిస్బావుల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ తమ స్థానాలకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తాత్కాలికంగా ఇద్దరు మాజీ ప్లేయర్లను ఆ పదవులకు ఎంపిక చేసిన పాక్ క్రికెట్ బోర్డు, ఆ తర్వాత ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్‌ను పాక్ హెడ్‌కోచ్‌గా, సౌతాఫ్రికా మాజీ బౌలర్ ఫిలందర్‌లను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసింది...

టీ20 వరల్డ్‌కప్ జట్టుకి ప్రకటించిన జట్టుపై తీవ్రమైన విమర్శలు రావడంతో పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, సీనియర్ పేసర్ హసన్ ఆలీ, ఫకార్ జమాన్‌లను టీమ్‌లో చేరుస్తున్నట్టు ప్రకటించిన కొద్ది గంటలకే గాయంతో మరో ప్లేయర్ దూరం కావడం విశేషం.

గత నెలలో న్యూజిలాండ్, పాక్ పర్యటనకు వెళ్లి వన్డే సిరీస్‌కి ఆరంభానికి కొన్ని నిమిషాల ముందు ‘సెక్యూరిటీ కారణాలతో’ అర్ధాంతరంగా టూర్‌ను క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత కొన్నిరోజులకే ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కూడా పాక్‌ టూర్‌ను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. 

click me!