T20 worldcup 2021: టాస్ గెలిచిన న్యూజిలాండ్... ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే గెలవాల్సిందే...

By Chinthakindhi RamuFirst Published Oct 31, 2021, 7:07 PM IST
Highlights

T20 worldcup 2021 India vs New Zealand: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... రెండు మార్పులతో బరిలో టీమిండియా...

టీ20 వరల్డ్‌కప్ 2021   టోర్నీ సూపర్ 12 రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు, ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. తొలి మ్యాచ్‌లో భారత జట్టు, దాయాది పాకిస్తాన్‌తో 10 వికెట్ల తేడాతో ఓడగా, న్యూజిలాండ్ జట్టు కూడా పాక్ చేతుల్లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఈ రెండు జట్లకీ ఈ మ్యాచ్ కీలకం కానుంది. 

నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే ప్లేఆఫ్స్ అవకాశాలు ఎక్కువవుతాయి. ఈ మ్యాచ్‌లో ఓడితే రెండు జట్లకీ ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి... ఆఫ్ఘానిస్తాన్, నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఆఫ్ఘాన్‌కి మూడు మ్యాచుల్లో రెండు విజయాలు ఉన్నాయి. మిగిలిన మ్యాచుల్లో న్యూజిలాండ్‌ లేదా టీమిండియాని ఓడిస్తే, ఆఫ్ఘాన్‌కి కూడా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. 

Latest Videos

Must Read: టీ20 వరల్డ్‌కప్‌లో ఆఖరిగా వికెట్ తీసిన భారత బౌలర్‌ ఎవరో తెలుసా... విరాట్ కోహ్లీ తర్వాత...

టీ20 వరల్డ్‌కప్ 2016 టోర్నీలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 79 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలోనే భారత జట్టుకి ఇదే అత్యల్ప స్కోరు.  ఆ మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన మిచెల్ సాంట్నర్, 3 వికెట్లు తీసిన ఇష్ సోదీ కూడా నేటి మ్యాచ్‌లో బరిలో దిగుతున్నారు...

గత 18 ఏళ్లలో న్యూజిలాండ్‌పై ఐసీసీ టోర్నీల్లో విజయం సాధించలేకపోయింది భారత జట్టు. 2003 వన్డే వరల్డ్‌ కప్ టోర్నీలో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన తర్వాత 2007 టీ20 వరల్డ్‌కప్, 2016 టీ20 వరల్డ్‌కప్, 2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీల్లో ఓడింది టీమిండియా...

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్ చేతుల్లో 8 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా, నేటి మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. సూర్య కుమార్ యాదవ్ గాయపడడంతో అతని స్థానంలో ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ జట్టులో వచ్చాడు. అలాగే గత మ్యాచ్‌లో వికెట్ల తీయలేకపోయిన భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కి తుది జట్టులో చోటు దక్కింది... న్యూజిలాండ్ జట్టు ఓ మార్పుతో బరిలో దిగింది. టిమ్ సిఫర్ట్ స్థానంలో ఆడమ్ మిల్నే తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఇదీ చదవండి: వెన్నెముక లేని వెధవలు, మతం పేరుతో దూషిస్తారా... మహ్మద్ షమీపై వచ్చిన ట్రోల్స్‌పై విరాట్ కోహ్లీ ఫైర్...

ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌లో మెజారిటీ మ్యాచుల్లో తొలుత ఫీల్డింగ్ చేసిన జట్లకే విజయం దక్కడం విశేషం. ఆఫ్ఘాన్ రెండు సార్లు, వెస్టిండీస్ ఓ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి విజయం సాధించాయి. ఇవి మినహా మిగిలిన మ్యాచులన్నింటిలో టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న జట్టుకే విజయం దక్కింది. 

భారత జట్టు: రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్,  రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్

న్యూజిలాండ్ జట్టు: మార్టిన్ గుప్లిట్, డార్లీ మిచెల్, కేన్ విలియంసన్, జేమ్స్ నీశమ్, ఆడమ్ మిల్నే, గ్లెన్ ఫిలిప్, డివాన్ కాన్వే, మిచెల్ సాంట్నర్, ఇష్ సోదీ, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్

click me!