కూతురు వామికతో కలిసి విరాట్ కోహ్లీ అల్లరి... క్యూట్ ఫోటో షేర్ చేసిన అనుష్క శర్మ...

Published : Oct 18, 2021, 05:54 PM IST
కూతురు వామికతో కలిసి విరాట్ కోహ్లీ అల్లరి... క్యూట్ ఫోటో షేర్ చేసిన అనుష్క శర్మ...

సారాంశం

కూతురితో కలిసి ఆడుకుంటున్న విరాట్ కోహ్లీ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అనుష్క శర్మ... ‘ఒకే ఫ్రేమ్‌లో నా హృదయమంతా నిండి ఉంది...’ అంటూ కాప్షన్...

ప్రస్తుతం భారత జట్టు, టీ20 వరల్డ్ కప్ టోర్నీ కోసం సమాయత్తమవుతోంది. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోబోతున్నట్టు ముందుగానే ప్రకటించడంతో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇదే మొట్టమొదటి, చివరి టీ20 వరల్డ్ కప్ కానుంది. కొన్నేళ్లుగా ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయిన విరాట్ కోహ్లీ, ఈ సారి ఆ లోటు ఎలాగైనా తీర్చుకోవాలని భావిస్తున్నాడు... 

మెంటర్‌గా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా భారత బృందంలో చేరడంతో టీమిండియాలో పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేశాయి. అయితే టీ20 వరల్డ్ కప్ ప్రాక్టీస్‌లో బిజీబిజీగా గడిపేస్తున్న విరాట్ కోహ్లీకి ఆయన కూతురు వామిక కోహ్లీకి కావాల్సిన రిలాక్స్ ఇస్తోందట. తీరిక దొరికినప్పుడల్లా కూతురితో ఆడుకోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడట విరాట్ కోహ్లీ...

తాజాగా కూతురితో కలిసి ఆడుకుంటున్న విరాట్ కోహ్లీ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది అనుష్క శర్మ. గర్భం దాల్చిన తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది అనుష్క శర్మ. కూతురితోనే పూర్తి సమయం గడుపుతోంది.

కొన్నాళ్ల కిందట మహానవమి శుభాకాంక్షలు తెలుపుతూ కూతురితో తాను దిగిన ఫోటోను షేర్ చేసిన అనుష్క, ఇప్పుడు తండ్రీకూతుళ్ల అల్లరిని క్యాప్చర్ చేసి అభిమానులతో పంచుకుంది...
‘ఒకే ఫ్రేమ్‌లో నా హృదయమంతా నిండి ఉంది...’ అనే కాప్షన్‌తో విరాట్ కోహ్లీ, వామికలపై తనకున్న ప్రేమను ఒక్క మాటలో చెప్పేసింది అనుష్క శర్మ...

ఈ ఫోటోకి బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, హీరోయిన్ రుహాణీ శర్మ, రకుల్ ప్రీత్, చాహాల్ భార్య ధనశ్రీ వర్మ, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... ‘హార్ట్ సింబల్స్...’తో కామెంట్స్ చేశారు.. కూతురిని సోషల్ మీడియాకి దూరంగా పెట్టాలని ముందుగానే నిర్ణయించుకున్న విరుష్క జోడీ, వామిక పోటోలను పోస్టు చేస్తున్నా... వేటిలోనూ కూతురి ముఖం కనిపించకుండా కేర్ తీసుకుంటున్నారు...

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?